కరోనాను జయించిన క్యాన్సర్ బాధిత బాలుడు

ప్రపంచ మొత్తం కరోనాతో యుద్ధం చేస్తోంది. అయితే, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఐదేళ్ల బాలుడు క్యాన్సర్‌‌తో బాధపడుతూ.. కరోనా వైరస్‌ను జయించాడు.

కరోనాను జయించిన క్యాన్సర్ బాధిత బాలుడు
Follow us

|

Updated on: Jun 22, 2020 | 4:53 PM

కరోనా మహమ్మారి ఎంతటి వారినైనా మంచానికి కట్టేస్తుంది. ప్రపంచ మొత్తం కరోనాతో యుద్ధం చేస్తోంది. అయితే, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఐదేళ్ల బాలుడు క్యాన్సర్‌‌తో బాధపడుతూ.. కరోనా వైరస్‌ను జయించాడు. పశ్చిమ బెంగాల్‌లోని పురాలియా జిల్లాకు చెందిన శత్రుఘన్ సింగ్ సర్దార్, గురువారి సింగ్ సర్దార్‌ దంపతులకు నాలుగు కుమారులు. నాలుగున్నర ఏళ్లుగా బ్లడ్ క్యాన్సర్‌‌తో బాధపడుతున్న వారి నాలుగో కొడుకు.. కోల్‌కతాలోని క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత నెల 30న నిర్వహించిన పరీక్షల్లో ఆ బాలుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో భయాందోళనకు గురైన బాలుడి తల్లిదండ్రులు కలకత్తా మెడికల్ కాలేజీలో కరోనా చికిత్స చేయించారు. దీంతో బాలుడు కరోనాను జయించి ఈ నెల 15న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. బాలుడు కోలుకోవడం పట్ల తల్లిదండ్రుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. పిల్లాడితోపాటు తల్లి గురువారి కూడా మరో రెండు వారాల పాటు హోం క్వారంటైన్‌లోనే ఉండాలని అధికారులు సూచించారు. బాలుడుకి కావల్సిన ఆహార పదార్ధాలతో అన్ని వసతుల కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.