శ్రీనగర్‌లో బక్రీద్ సందడి.. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్

Fingers Crossed For Eid In J&K: Some Easing Of Lockdown But Curfew Back In Srinagar

జమ్ముకశ్మీర్‌లో బక్రీదు పండుగ సందర్భంగా.. పలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అయితే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మసీదు ప్రాంతాల్లో అధికారులు తగు చర్యలు చేపట్టారు. బక్రీద్‌ సందర్భంగా కశ్మీరీ లోయలో 2.5 లక్షల గొర్రెలను అందుబాటులోకి తెచ్చారు. జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే 370, 35ఏ రద్దు కారణంగా ఈనెల 5 నుంచి కశ్మీర్‌లో విధించిన ఆంక్షలతో జన జీవనం స్తంభించింది. అయితే వీటి రద్దు ప్రభావం పండుగపై పడకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఐదు జిల్లాల్లో పూర్తిగా కర్ఫ్యూ ఎత్తివేశారు. అయితే 144 సెక్షన్‌ విధించారు. మరో ఐదు జిల్లాల్లో ఆంక్షలు సడలించారు. ఇంటింటికి నిత్యా వసరాల సరఫరాకు మొబైల్‌ వ్యాన్లను రంగంలోకి దించారు. గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ కశ్మీరీలకు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు.

ఇక సౌదీ అరేబియాలో హజ్ యాత్రకు వెళ్లిన యాత్రికులు ఈనెల 18 నుంచి తిరిగి రానున్నారు. వారు తమ సొంత స్థలాలకు వెళ్లేందుకు హెల్ప్‌లైన్‌ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. ఇంటర్నెట్‌, మొబైల్‌ ఫోన్‌ సర్వీసులపై నిషేధం ఉన్న నేపథ్యంలో సీఆర్పీఎఫ్‌ ఆధ్వర్యంలో కశ్మీరీలు ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న తమ వారితో సంప్రదింపులకు 300 స్పెషల్‌ టెలిఫోన్‌ బూత్‌లు ఏర్పాటుచేశారు. విద్యుత్‌, నీటి సరఫరాలో ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టారు.

అయితే అక్కడక్కడా ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో ప్రజలు గుమికూడటం పై అధికారులు నిషేధాజ్ఞలు విధించారు. ప్రజలంతా ఇండ్లకు వెళ్లిపోవాలని, దుకాణదారులు షాపులు మూసివేయాలని లౌడ్‌ స్పీకర్లలో ప్రకటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *