కరోనా రోగులకు చికిత్స చేసే వైద్య సిబ్బందికి అధ్వాన్న గదులు.. యూపీ నిర్వాకం

యూపీలోని రాయ్ బరేలీ జిల్లాలో తమకు  కేటాయించిన 'యాక్టివ్ క్వారంటైన్' గదుల దుస్థితిని కొందరు డాక్టర్లు, హెల్త్ వర్కర్లు ప్రభుత్వ దృష్టికి తెచ్చారు. ఓ ప్రభుత్వ పాఠశాలనే క్వారంటైన్ కేంద్రంగా మార్చి.. ఇందులోనే ఉంటూ కరోనా రోగులకు చికిత్సలు చేయాలని అధికారులు సూచించారట.

కరోనా రోగులకు చికిత్స చేసే వైద్య సిబ్బందికి అధ్వాన్న గదులు.. యూపీ నిర్వాకం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 23, 2020 | 5:38 PM

యూపీలోని రాయ్ బరేలీ జిల్లాలో తమకు  కేటాయించిన ‘యాక్టివ్ క్వారంటైన్’ గదుల దుస్థితిని కొందరు డాక్టర్లు, హెల్త్ వర్కర్లు ప్రభుత్వ దృష్టికి తెచ్చారు. ఓ ప్రభుత్వ పాఠశాలనే క్వారంటైన్ కేంద్రంగా మార్చి.. ఇందులోనే ఉంటూ కరోనా రోగులకు చికిత్సలు చేయాలని అధికారులు సూచించారట. (యాక్టివ్ క్వారంటైన్ లో ఉండే వైద్య సిబ్బంది.. కరోనా వ్యాప్తి నివారణకు తమ ఇళ్లకు వెళ్లే వీలు ఉండదు). అయితే ఈ కేంద్రంలో పని చేయని ఫ్యాన్లు, అధ్వాన్న స్థితిలో ఉన్న టాయిలెట్లు, దుర్గంధ భూయిష్టమైన పరిసరాలు చూసి ఈ వైద్య సిబ్బంది నిర్ఘాంతపోయారు. తమకు పంపిన ఆహరం కూడా నాసిరకంగా ఉండడాన్ని వీరు గమనించారు. వెంటనే వారు వీటి ఫోటోలు, వీడియోలు తీసి పైఅధికారులకు పంపారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము రోగులకు ఎలా సేవలందించగలమని ప్రశ్నించారు. దీంతో కంగారు పడిన చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఒకరు వఛ్చి.. అక్కడి ‘సీన్’ చూసి.. ఈ వైద్య సిబ్బందిని వెంటనే దగ్గరలోనే ఉన్న గెస్ట్ హౌస్ కి పంపాలని ఆదేశించారు.