Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. 2 లక్షల 36 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 236657. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 115942. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 114073. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 6642. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • కేటీఆర్ ఆదేశాలతో నటి మీరాచోప్రా ఫిర్యాదు ఫై దర్యాప్తు ముమ్మరం . మీరాచోప్రా ను ట్రోల్ చేసిన 15 ట్విటర్ హ్యాండిల్స్ గుర్తింపు . 15 మందికి నోటీసులు పంపిన పోలిసులు. అసభ్యం గా ట్వీట్ చేసిన 15 మంది ని అరెస్ట్ చేసే అవకాశం.
  • మరికొద్ది గంటల్లో పదో తరగతి పరీక్షల నిర్వహణ పై రానున్న క్లారిటీ... టెన్త్ బోర్డు, విద్యార్థులు, పేరెంట్స్ లో కొనసాగుతున్న ఉత్కంఠ. తీర్పు అనుకూలంగా వస్తుందన్న ధీమాతో బోర్డు... మరోవైపు పరీక్షల నిర్వహణకు అన్ని రకాలుగా సిద్ధమైన ఎస్ఎస్సి బోర్డు ... ఇప్పటికే పరీక్ష సెంటర్ల వద్ద కరోనా కట్టడికి అవసరమైన చర్యలు తీసుకున్న ఎస్ ఎస్ సి బోర్డ్ పరీక్ష కేంద్రాలకు శానిటైజర్లు, మార్కులు, గ్లౌజులు, థర్మల్ స్కానర్లు, తరలింపు... ఎక్కడి వారు అక్కడే పరీక్షలు రాసే విధంగా ఏర్పాట్లు..
  • విశాఖ: డాక్టర్ సుధాకర్ డిశ్చార్జ్. కోర్ట్ అనుమతితో ఆసుపత్రి నుంచి డుశ్చార్జ్ అయిన డాక్టర్ సుధాకర్.
  • తిరుపతి: టిటిడి సప్తగిరి మాస పత్రిక చీఫ్ ఎడిటర్ రాధా రమణ, సబ్ ఎడిటర్ ఉత్తర ఫల్గుణ ని సస్పెండ్ చేసిన జేఈవో బసంత్ కుమార్. సప్తగిరి పత్రికలో కుసుడు ఆర్టికల్ ను ప్రచురించి ఉద్దేశపూర్వకంగా టిటిడి ని చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేశారనే కారణాలతో సస్పెన్షన్. 2016లో నిషేధించిన కథనాన్ని పునీత్ అనే తొమ్మిదో తరగతి విద్యార్థి పేరుతో ప్రచురించారని విజిలెన్స్ ఎంక్వయిరీలో తేలడంతో సస్పెన్షన్. సప్తగిరి పత్రిక వివాదం పై విచారణ కొనసాగుతోందన్న టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి.
  • లంగర్ హౌజ్ డబల్ మర్డర్ కేసును ఛేదించిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు రౌడీ షీటర్ ఆర్షద్, ఇద్దరు వ్యక్తులు. రౌడీ షీటర్ చంద్, స్నేహితుడు అబూ లను కత్తులో నరికి చంపిన ఆర్షద్ అండ్ గ్యాంగ్. క్వాలిస్ వాహనం లో ఆరుగురు ఉన్నట్టు గుర్తింపు. ఫరారి లో మరో ముగ్గురు, ముంబై వైపు వెళ్లినట్టు అనుమానం. పాత కక్ష్యలో తో నే హత్య చేసినట్టు గా తేల్చిన పోలీసులు.
  • ఢిల్లీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయంలో ఐదుగురికి కరోనా పాజిటివ్. ఖాన్ మార్కెట్ లోని లోక్ నాయక్ భవన్ మూసివేత. ఈడి కార్యాలయాన్ని శానిటైజ్ చేసిన అధికారులు.. రేపు కూడా మూసిఉండనున్న ఈడి కార్యాలయం. హోమ్ క్వారేంటిన్ లోకి వెళ్లిన పలువురు అధికారులు.

నాకు దక్కకపోతే ఇంకెవరికీ దక్కొద్దు.. దేవేంద్రుని ప్లాన్ అదేనా?

devendra fadnavis super plan, నాకు దక్కకపోతే ఇంకెవరికీ దక్కొద్దు.. దేవేంద్రుని ప్లాన్ అదేనా?

వారం, పది రోజుల క్రితం మహారాష్ట్రలో జరిగిన రాజకీయ పరిణామాలకు, అప్పుడెప్పుడో రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ మగధీర సినిమాలోని విలన్ డైలాగ్‌కు లింకుందా? తాజాగా వెల్లడవుతున్న అంశాలను చూస్తుంటే వుందనే అనిపిస్తోంది. పది రోజుల క్రితం ప్రభుత్వం ఏర్పాటు చేయలేనని చేతులెత్తేసిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నట్లుండి అజిత్ పవార్ ఇచ్చిన ఫేక్ అండతో ఎలా అడుగు ముందుకేశాడు? అదీ వీకెండ్‌లో వస్తున్న సెలవు దినాలకు ముందు దేవేంద్ర ఫడ్నవీస్ ఎందుకు దూకుడు ప్రదర్శించాడు? ఈ ప్రశ్నలకు ఇప్పుడిపుడే జవాబు దొరుకుతోంది.

నిజానికి మహారాష్ట్రలో తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని బిజెపి నేతలు 100 శాతం నమ్మారు. సొంత బలానికి శివసేన అండ తోడైతే కాంగ్రెస్, ఎన్సీపీలు తమ విజయాన్ని నిలువరించలేవని కలలుగన్నారు. అనుకున్నట్టుగానే నేషనల్ మీడియా ఎగ్జిట్ పోల్ సర్వేల్లో బిజెపి-శివసేన కూటమికి 200 సీట్లు దాటుతాయని ఫలితాలను వెలువరించింది. కానీ ఓ పక్క ఫలితాలు వెలువడుతుండగానే శివసేనలో దాగున్న రెండో సింహం నిద్ర లేచింది. సీఎం సీటుపై సంజయ్ రౌత్‌తో మాట్లాడించడం ద్వారా పేచీ షురూ చేసింది.

కానీ, బిజెపి మాత్రం.. శివసేనకు తమతో కల్వడం తప్ప మరో మార్గం లేదని ఊహల్లో వుండిపోయింది. బిజెపిని కాదని కాంగ్రెస్ పార్టీతో ఉద్ధవ్ థాక్రే జత కడతాడని కమలనాథులు అంఛనా వేయలేకపోయారు. కానీ శరద్ పవార్‌ రూపంలో ఓ అభినవ చాణక్యుడు తమ సీటును లాగేస్తాడని అంఛనా వేయలేకపోయారు. తీరా పరిస్థితి అవగతమయ్యాక చేసేదేమీ లేక చేతులెత్తేశారు దేవంద్ర ఫడ్నవీస్. కానీ అనూహ్యంగా అజిత్ పవార్‌తో శరద్ పవార్ గేమ్ ఆడించడంతో దేవంద్ర ఫడ్నవీస్ దాన్ని అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేశాడు. కానీ, పదవీ ప్రమాణం చేసిన కొన్ని గంటల్లోనే తాము శరద్ పవార్ ఆడిన జగన్నాటకంలో పావులమయ్యామని గుర్తించాడు ఫడ్నవీస్. అందుకే.. మగధీర సినిమాలో విలన్ డైలాగ్‌ స్ఫురించే పని చేసేశాడు.. సీఎంగా వున్న కొన్ని గంటల్లోనే.

నాకు దక్కనిది…

మొన్నటి ఎన్నికలకు ముందు మహారాష్ట్రకు మరీ ముఖ్యంగా ముంబయి నగరానికి కేంద్ర ప్రభుత్వం భారీగానే నిధులు కేటాయించింది. దేశ ప్రజలంతా ఆశ్చర్యపోయేలా ఒక్క ముంబయి నగరానికే 20వేల కోట్ల రూపాయలను కేటాయించింది మోదీ ప్రభుత్వం. దాంతో పాటు పలు ఇతర పథకాల కింద మరో 20 వేల కోట్ల రూపాయలను మహారాష్ట్ర రాష్ట్రానికి కేటాయించారు. తాను అధికారంలోకి వస్తే వినియోగించి, దాని క్రెడిట్ తనకు, తన బాస్ నరేంద్ర మోదీకి తీసుకురావలని ఫడ్నవీస్ అనుకున్నాడు. కానీ, పరిస్థితి తల్లకిందులై… ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాడు. అందుకే తన చేతులతో వినియోగించాల్సిన నిధులు రాష్ట్రానికి అందకుండా నిర్ణయం తీసుకునీ మరీ రాజీనామా చేసి సీఎంఓ నుంచి బయటికి వచ్చాడు దేవేంద్ర ఫడ్నవీస్.

ఈ విషయం మామూలుగా లీక్ అయి, గాసిప్ రూపంలో వస్తే ఎవరూ పెద్దగా పట్టించుకునే వారు కాదు.. కానీ ఏకంగా మాజీ కేంద్ర మంత్రి, కర్నాటక బిజెపి నేత అనంత్ కుమార్ హెగ్డే స్వయంగా వెల్లడించడంతో అంతా ఉలిక్కి పడ్డారు. ఎన్నికలకు ముందు కుదిరిన మిత్రధర్మానికి గండి కొట్టిన శివసేనకు ఫడ్నవీస్ పెద్ద దెబ్బే కొట్టాడన్న చర్చ ఇప్పుడు ముంబయిలో జరుగుతోంది. అయితే, రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకుండా చేశాడన్న అపప్రధ తనకు రాకూడదన్న వ్యూహంతో అనంతకుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలను ఫడ్నవీస్ ఖండించారు. అది వేరే విషయం.

Related Tags