“ఏపీలో మద్యం తాగితే వారంలో పక్షవాతమే”

స‌ర్కార్ మద్యం దుకాణాల్లో కల్తీ మద్యం విక్రయిస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రజల ప్రాణాలంటే ప్ర‌భుత్వానికి లెక్క‌లేకుండా పోయింద‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు పాఠాలు చెప్పే టీచ‌ర్స్ ను మద్యం షాపుల వద్ద కాపలా పెడతారా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి మంచి చేస్తున్నామో? చెడు చేస్తున్నామో? ఆలోచించే లీడ‌ర్ ప్రభుత్వంలో లేకపోవటం దురదృష్టకరమన్నారు. డిస్టిలరీల్లో ఏ లిక్క‌ర్ తయారు చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స‌ర్కార్ మద్యం షాపుల్లో లభించే […]

ఏపీలో మద్యం తాగితే వారంలో పక్షవాతమే
Follow us

|

Updated on: May 05, 2020 | 4:12 PM

స‌ర్కార్ మద్యం దుకాణాల్లో కల్తీ మద్యం విక్రయిస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రజల ప్రాణాలంటే ప్ర‌భుత్వానికి లెక్క‌లేకుండా పోయింద‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు పాఠాలు చెప్పే టీచ‌ర్స్ ను మద్యం షాపుల వద్ద కాపలా పెడతారా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి మంచి చేస్తున్నామో? చెడు చేస్తున్నామో? ఆలోచించే లీడ‌ర్ ప్రభుత్వంలో లేకపోవటం దురదృష్టకరమన్నారు. డిస్టిలరీల్లో ఏ లిక్క‌ర్ తయారు చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

స‌ర్కార్ మద్యం షాపుల్లో లభించే లిక్కర్ ను వారం రోజులు తాగితే పక్షవాతం వస్తుందని సోమిరెడ్డి ప్రజలను హెచ్చరించారు. ఎప్పుడూ వినని, చూడ‌ని బ్రాండ్లను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అర్థం కావట్లేదన్నారు. చెత్తమందు తయారు చేసే డిస్టిలరీలను ఎంక‌రేజ్ చెయ్య‌డ‌మే కాక.. రేట్లు పెంచటం మరింత దుర్మార్గ చర్య అని సోమిరెడ్డి విమర్శించారు. లాక్​డౌన్ ముగిసే వరకూ మద్యం షాపులు మూసే ఉంచాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో అమ్మే పాత బ్రాండ్లనే ఏపీలోనూ అమ్మాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో అన్ని రాష్ట్రాలకు ప‌ర్మిష‌న్ ఇచ్చినా… పొరుగు రాష్ట్రాలేవీ మద్యం షాపులు తెరవలేదని గుర్తుచేశారు. భౌతికదూరంపై ప్రపంచ దేశాలు మొరపెట్టుకుంటుంటే..రాష్ట్రంలో కిలోమీటర్ల దూరం బారులు తీరేలా చేయటంతో పాటు రేట్లు పెంచి పేదల నుంచి కోట్ల డ‌బ్బు దండుకుంటున్నారని ఆరోపించారు. నిన్న మద్యం షాపులు తెరుచుకోవటం వల్ల సర్వేపల్లిలోనే ముగ్గురు చనిపోయారని చెప్పారు. ఎన్నికలు జరిగితే ఎంత మంది క్యూలో నిలబడేవారో మద్యం షాపుల‌ వద్ద అంతమంది క్యూకట్టారన్నారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ