క్రిస్మస్‌ పండుగను ఇంటిపట్టునుండే జరుపుకోండి, ఆంక్షలను తప్పక పాటించండి : బ్రిటన్‌ ప్రధాని విన్నపం

నలుగురు కలిసి చేసుకునేదే పండుగ.. పండుగ అంటేనే సంబరం. కరోనా వైరస్‌ ఆ సంబరాలు లేకుండా చేసింది.. సమీప భవిష్యత్తులో కరోనా కంట్రోల్‌ అవుతుందన్న గ్యారంటీ కూడా ఏమీ లేదు..

క్రిస్మస్‌ పండుగను ఇంటిపట్టునుండే జరుపుకోండి, ఆంక్షలను తప్పక పాటించండి : బ్రిటన్‌ ప్రధాని విన్నపం
Follow us

|

Updated on: Nov 25, 2020 | 4:09 PM

నలుగురు కలిసి చేసుకునేదే పండుగ.. పండుగ అంటేనే సంబరం. కరోనా వైరస్‌ ఆ సంబరాలు లేకుండా చేసింది.. సమీప భవిష్యత్తులో కరోనా కంట్రోల్‌ అవుతుందన్న గ్యారంటీ కూడా ఏమీ లేదు.. భారత్‌తో పాటు చాలా దేశాలలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతూనే ఉంది.. యూరోప్‌ దేశాలలో అయితే మరీ దారుణం.. అక్కడ చాలా దేశాలలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించాల్సిన పరిస్థితి వచ్చింది.. కోవిడ్‌ నిబంధనలను కఠినతరం చేయాల్సి వచ్చింది.. పదేపదే ప్రజలను హెచ్చరించాల్సి వస్తోంది.. అక్కడి ప్రజలు ఘనంగా జరుపుకునే క్రిస్మస్‌ పండుగకు అట్టే రోజులు లేవు.. సరిగ్గా నెల రోజుల సమయమే ఉంది.. అందుకే ఆయా దేశాల అధినేతలు ఆందోళన చెందుతున్నారు.. పండుగ వేళ జనమంతా రోడ్ల మీదకు వస్తారేమోనన్న భయం, సామూహికంగా పండుగ జరుపుకుంటారేమోనన్న కంగారు.. అందుకే పండుగ వేళ ఎలా ఉండాలన్నది మీకు మీరే డిసైడ్‌ చేసుకోండని బ్రిటన్‌ పర్ధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రజలను కోరారు. పండుగ పూట ఇంటిపట్టునే ఉండడని హితవు చెబుతున్నారు. బంధుమిత్రులను కలుద్దామని బయటకు మాత్రం రాకండి అని చెప్పారు. డిసెంబర్‌ 23 నుంచి 27 వరకు కేవలం మూడు కుటుంబాలు మాత్రమే కలిసేందుకు అనుమతి ఇచ్చింది బ్రిటిష్‌ ప్రభుత్వం. జర్మనీలో ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతున్నా పండుగ వేళ మాత్రం రెండు కుటుంబాలను కలుసుకునే అవకాశం ఇచ్చింది.. అలాగే స్వీడన్‌లో కేసులు తగ్గుతున్నప్పటికీ క్రిస్మస్‌ పండుగ రోజుల్లో ఆంక్షలు విధిగా పాటించాలని ప్రభుత్వం చెప్పింది.. బెల్జియంలోనూ అంతే! అక్కడ క్రిస్మస్‌ రోజుల్లో మరింత అప్రమత్తమంగా ఉండాలని అధికారులు సూచించారు..