నో చిన్న సినిమాలు.. ఓన్లీ బిగ్ ఫిలిమ్స్!

‘ఈ రోజుల్లో’ అనే చిన్న సినిమాతో పెద్ద హిట్ కొట్టిన దర్శకుడు మారుతి. ఈ చిత్రం తర్వాత వరుసగా చిన్న సినిమాలు తీసి బంపర్ హిట్స్ కొడుతూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించాడు. మారుతి తన సొంత నిర్మాణ సంస్థ మారుతి టాకీస్‌పై పలు చిత్రాలు నిర్మించి ప్రొడ్యూసర్‌గా కూడా సక్సెస్‌ సాధించాడు. అటు నిర్మాతగా.. ఇటు దర్శకుడిగా ఫుల్ బిజీగా ఉన్న మారుతి ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హీరోగా ‘ప్రతి రోజూ పండుగే’ అనే […]

నో చిన్న సినిమాలు.. ఓన్లీ బిగ్ ఫిలిమ్స్!
Follow us

|

Updated on: Oct 08, 2019 | 4:33 AM

‘ఈ రోజుల్లో’ అనే చిన్న సినిమాతో పెద్ద హిట్ కొట్టిన దర్శకుడు మారుతి. ఈ చిత్రం తర్వాత వరుసగా చిన్న సినిమాలు తీసి బంపర్ హిట్స్ కొడుతూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించాడు. మారుతి తన సొంత నిర్మాణ సంస్థ మారుతి టాకీస్‌పై పలు చిత్రాలు నిర్మించి ప్రొడ్యూసర్‌గా కూడా సక్సెస్‌ సాధించాడు. అటు నిర్మాతగా.. ఇటు దర్శకుడిగా ఫుల్ బిజీగా ఉన్న మారుతి ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హీరోగా ‘ప్రతి రోజూ పండుగే’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా మీడియాతో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

‘ప్రతి రోజూ పండుగే’ చిత్రం పూర్తిగా కుటుంబ కథాంశంతో తెరకెక్కుతోంది. మనం ప్రతి చిన్న మూమెంట్‌ను సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాం. అలాంటిది జీవితంలో ఆఖరి వేడుకైన చావును కూడా ఎందుకు సెలబ్రెట్ చేసుకోకూడదు.? వయసు పైబడుతున్న వారికి బెస్ట్ సెండాఫ్ ఇవ్వాలనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉంటుందని మారుతి తెలిపారు. ఇప్పటివరకు ఇలాంటి కథాంశం రాలేదని.. ప్రేక్షకులకు ఇది తప్పకుండా కనెక్ట్ అవుతుందని ఆయన అన్నారు.

అంతేకాక తన బ్యానర్‌లో చిన్న సినిమాలను నిర్మించడం ఆపేశానని మారుతి వెల్లడించారు. ప్రస్తుతం వస్తున్న చిన్న సినిమాలన్నీ యువతను టార్గెట్ చేయడం కోసం వల్గారిటీని ఎక్కువగా జొప్పిస్తున్నారని.. తాను కూడా తొలినాళ్లలో డబుల్ మీనింగ్ డైలాగులు పెట్టానని.. అయితే ఇప్పుడు అవి సినిమాను ఏమాత్రం నడిపించవని ఆయన తెలిపారు.

భవిష్యత్తులో పెద్ద సినిమాలు మాత్రమే చేస్తానని.. జీఏ2, యూవీ బ్యానర్లతో కలిసి సినిమాలు చేయాలనుకుంటున్నట్లు మారుతి తన మనసులోని మాటను వెల్లడించారు. కాగా, ‘మహానుభావుడు’ హిందీ రీమేక్ చర్చలు జరుగుతున్నాయని.. దానికి తానే దర్శకత్వం వహించవచ్చని ఆయన అన్నారు.

Latest Articles
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?