
సినిమా తెరపై విలన్‌గా, హీరోగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన బాలీవుడ్ ప్రముఖ నటుడు వివేక్ ఒబెరాయ్. తాజాగా నిజజీవితంలో తన ఉదారతతో రియల్ హీరో అనిపించుకున్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం రామాయణం. ఈ మూవీలో విభీషణుడి పాత్రలో నటించినందుకు తనకు రావాల్సిన రూ. 6 కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌ను ఆయన ఒక పైసా కూడా తీసుకోకుండా, క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారుల వైద్య సహాయం కోసం విరాళంగా ప్రకటించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. వివేక్ ఒబెరాయ్ తన రెమ్యునరేషన్ మొత్తాన్ని తనకు వద్దని, ఆ రూ. 6 కోట్లను క్యాన్సర్ బాధితులైన చిన్నపిల్లల చికిత్సకే నేరుగా అందించాలని చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రాను స్వయంగా కోరారు. అంతటితో ఆగకుండా, తన 50వ పుట్టినరోజు సందర్భంగా తీవ్రమైన క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న 50 మంది పేద చిన్నారుల పూర్తి వైద్య ఖర్చులను తానె స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజును ఇలాంటి గొప్ప సామాజిక సేవకు వినియోగించి, ఎన్నో నిరుపేద కుటుంబాల జీవితాల్లో ఆయన సరికొత్త వెలుగులు నింపారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్
ఈ సందర్భంగా వివేక్ ఒబెరాయ్ మాట్లాడుతూ.. “నేను నమ్మే ఒక మంచి ఆశయం కోసం ఈ మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లల చికిత్సకు ఈ డబ్బు ఉపయోగపడటం కంటే నాకు మరేదీ ఎక్కువ సంతోషాన్ని ఇవ్వదు. ఈ సినిమా ద్వారా రూపాయి కూడా నేను తీసుకోకూడదని ముందే అనుకున్నాను” అని తెలిపారు. అంతేకాకుండా, భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ వేదికపై నిలబెట్టేలా రామాయణం చిత్రాన్ని రూపుదిద్దుతున్న తీరుపై ఆయన ప్రశంసలు కురిపించారు.
ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్ షేక్..
సినిమాల్లో కనిపించే నటన మాత్రమే కాకుండా, నిజజీవితంలో సమాజం పట్ల బాధ్యతను, మానవత్వాన్ని చాటుకున్న వివేక్ ఒబెరాయ్ చేసిన ఈ అద్భుతమైన సేవపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, సినీ వర్గాలు , అభిమానులు నీరాజనాలు పడుతున్నారు. మరోవైపు రామాయణం చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. మొదటి రోజే రూ.150 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.
ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..
Vivek Oberoi New
ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..