
బాలీవుడ్ నటి, రచయిత్రి ట్వింకిల్ ఖన్నా ఒక వేడుకలో ధరించిన ‘పాము’ ఆకారపు నెక్లెస్ ఇప్పుడు అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. కోట్ల రూపాయల విలువైన ఆ లగ్జరీ నెక్లెస్ విశేషాలేంటో తెలుసుకుందాం. ఒక సాధారణ నెక్లెస్ ధర ఎంత ఉండవచ్చు? వేలు, లక్షలు.. మహా అయితే కొన్ని కోట్లు. కానీ, ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీల నుండి రాచకుటుంబాల వరకు అందరినీ ఆకర్షించే ఒకే ఒక్క డిజైన్ ‘సెర్పెంటి’. తాజాగా ఒక ఈవెంట్లో పచ్చ రంగు ఇస్సీ మియాకే డ్రెస్ ధరించిన ఆ అభినేత్రి, తన మెడలో ధరించిన వజ్రాల హారంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ హారం చూడటానికి ఒక పాము ఆకృతిలో ఉండి, నిగనిగలాడే వజ్రాలు, పచ్చలతో మెరిసిపోతోంది. ఆ నటి మరెవరో కాదు.. ట్వింకిల్ ఖన్నా. ఆమె ధరించిన ఈ బుల్గారీ సెర్పెంటి నెక్లెస్ విశేషాలివే.
కేవలం ట్వింకిల్ ఖన్నా మాత్రమే కాదు, అంతర్జాతీయ నటీమణులు జెండయా, అన్నే హాత్వే, ప్రియాంక చోప్రా వంటి వారు ఈ బ్రాండ్‌కు అంబాసిడర్లుగా ఉన్నారు. గతంలో ప్రియాంక చోప్రా ధరించిన ‘సెర్పెంటి మహారాణి’ నెక్లెస్ లో 109 క్యారెట్ల రూబెల్లైట్ మరియు వందలాది వజ్రాలు ఉండటం విశేషం. ఈ నగలకు వేలంలో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. మార్చి 2024లో జరిగిన ఒక వేలంలో ఒక డైమండ్ సెర్పెంటి నెక్లెస్ దాదాపు రూ. 37 కోట్లకు అమ్ముడైందంటే వీటి క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సెర్పెంటి డిజైన్ అనేది కేవలం ఒక నగ మాత్రమే కాదు, అది శక్తికి, పునర్జన్మకు సంకేతం. అందుకే దశాబ్దాలు గడిచినా ప్రపంచ కుబేరుల జాబితాలో ఈ డిజైన్ ఎప్పుడూ మొదటి వరుసలోనే ఉంటుంది. ట్వింకిల్ ఖన్నా ఈ నెక్లెస్ ధరించిన తీరు ఆమె అభిరుచికి అద్దం పడుతోంది.