Tollywood: బూరెబుగ్గల ఈ చిన్ని కృష్ణయ్య.. ఇప్పుడు టాలీవుడ్ హీరో.. గుర్తుపట్టారా..?

|

Apr 19, 2024 | 7:21 PM

ఫోటోలో ఉన్న ఈ చిన్ని కన్నయ్యను గుర్తుపట్టారా ? అతడు ఇప్పుడు తెలుగులో మంచి హీరో. విలక్షణమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఎవరో గుర్తుపట్టారా..? క్లూ ఏంటి అంటే.. ఇటీవలే తండ్రిగా ప్రమోషన్ పొందాడు....

Tollywood: బూరెబుగ్గల ఈ చిన్ని కృష్ణయ్య.. ఇప్పుడు టాలీవుడ్ హీరో.. గుర్తుపట్టారా..?
Hero Childhood Photo
Follow us on

పైన ఫోటోలో చిన్ని కన్నయ్య గెటప్‌లో ఉన్న ఈ బాలుడిని గుర్తుపట్టారా ? అతను ఇప్పుడు టాలీవుడ్ మంచి హీరోగా రాణిస్తున్నాడు. ఫ్యామిలీ మూవీస్‌ను ఇష్టపడేవారు ఇతడిని బాగా అభిమానిస్తారు. స్టోరీ సెలక్షన్ విషయంలో తోపు అనే పేరుంది. కెరీర్ తొలినాళ్లలో చిన్న, చిన్న రోల్స్ చేసిన ఇతడు.. అంచెలంచెలుగా ఎదుగుతూ హీరోగా మారాడు. ప్రజంట్ తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్నాడు. సినిమా.. సినిమాకు వైవిధ్యం చూపుతూ.. తనను తాను ఎప్పుడూ కొత్తగా మలుచుకుంటున్నాడు. ఇప్పుడున్న యంగ్ హీరోలతో ఇతను ఓ గుడ్ కాంపిటేటర్. ఇతడి సినిమానా అయితే బాగానే ఎంటర్టైన్ చేస్తాడు అనే మార్క్ తెచ్చుకున్నాడు?.. ఏంటి అతను ఎవరో మీరు ఇంకా కనిపెట్టలేకపోయారా..? అయితే ఇక లేట్ చేయకుండా మేమే చెప్పేస్తాం.

పైన ఫోటోలలో ఉన్న బుడ్డోడు..హీరో శర్వానంద్. సినిమా సినిమాకు తన పరిధిని విస్తరిస్తూ పోతున్నాడు శర్వ.  ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి.. హీరోగా మారాడు. యువసేన మూవీ ఇతనికి మంచి పేరు తెచ్చింది. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా టాలెంట్ ఉన్న డైరెక్టర్స్‌కి అవకాశం ఇవ్వడంతో.. కొన్ని అవార్డులు కూడా అతడిని వరించాయి. అమ్మ చెప్పింది,  గమ్యం, అందరి బంధువయ, ప్రస్థానం సినిమాలు. ముఖ్యంగా దేవ కట్టా తీసిన ప్రస్థానం.. శర్వా కెరీర్‌లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఫస్ట్ కంటెంట్‌కు ప్రాముఖ్యత ఇచ్చిన శర్వా.. ఆ తర్వాత కమర్షియల్ సినిమాల వైపు మొగ్గు చూపాడు.  శతమానం భవతి సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ చేరువయ్యాడు.  ఒకే ఒక జీవితం కూడా మంచి క్లాస్ హిట్ అయింది. ఈ ఏడాది శర్వానంద్‌ తన బర్త్ డే నాడే డబుల్‌ ప్రమోషన్‌ పొందాడు. శర్వా తండ్రయ్యాడు. అతడి భార్య పండంటి పాపకు జన్మనిచ్చింది. ఆ పాపకు  ‘లీలా దేవి మైనేని’ అనే పెట్టారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి