గుంటూరు కారం సినిమాతో ఈ ఏడాది సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ చూపులన్ని రాజమౌళి ప్రాజెక్ట్ పైనే ఉన్నాయి. వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకున్నారు సూపర్ స్టార్ అభిమానులు. ఇంకా పేరు పెట్టన ఈ సినిమాకు ప్రస్తుతం SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ ప్రచారమవుతుంది. భారీ బడ్జెట్తో నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన విషయాలను ఇప్పటివరకు ప్రకటించలేదు. కానీ స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రం కొద్ది రోజులుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలే మహేష్ ఒంటరిగా యూరప్ వెళ్లడంతో రాజమౌళి సినిమా కోసమే అంటూ ప్రచారం కూడా నడిచింది. తాజాగా ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ పై రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
తాజాగా టీవీ 9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. మహేష్ బాబుతో రాజమౌళి చేయబోయే సినిమా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యిందని అన్నారు. ఈ సినిమా టెక్నికల్ వర్క్ కోసం ఇటీవలే యూరప్ వెళ్లిన మహేష్.. త్వరలోనే ఇండియాకు తిరిగి రానున్నారట. అలాగే జర్మనీలో సినిమాకు సంబంధించిన మూడు నాలుగు రోజుల వర్క్ షాప్ జరగనుందని.. ప్రీ విజువలైజేషన్ కి సంబంధించిన వర్క్ షాప్ అని తెలుస్తోంది. అలాగే ఈ మూవీలో ఎక్కువగా గ్రాఫిక్స్ వర్క్ ఉండనుందని సమాచారం. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించనున్నారని టాక్. ఇప్పటివరకు దేశంలోనే ఇంత పెద్ద మొత్తంలో నిర్మిస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం.
అలాగే ఇందులో మహేష్ సరసన ఇండోనేషియా నటి చెల్సియా ఇస్లాన్ నటించనుందని టాక్. త్వరలోనే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీలో మహేష్ సరికొత్త లుక్లో కనిపించనున్నారని సమాచారం. అలాగే ఈ చిత్రంలో నటించే నటీనటుల గురించి తెలియాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.