ఈ సారి యాక్షన్ మూవీ రానున్న లెజెండ్ శరవణన్.. హీరోయిన్‌గా టాలీవుడ్ హాట్ బ్యూటీ

లెజెండ్ శరవణన్ ఈ పేరు ఈ మధ్య బాగా వినిపిస్తోంది. 50ఏళ్ల వయసులో హీరో అవ్వాలనే కలను నెరవేర్చుకున్నారు శరవణన్. ప్రముఖ వస్త్ర వ్యాపారం శరవణన్ స్టోర్స్ అధినేత అయిన శరవణన్ గతంలో తన బ్రాండ్‌కు తానే యాడ్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ట్రోల్స్ బారిన కూడా పడ్డారు.

ఈ సారి యాక్షన్ మూవీ రానున్న లెజెండ్ శరవణన్.. హీరోయిన్‌గా టాలీవుడ్ హాట్ బ్యూటీ
Legend Saravanan

Updated on: Sep 06, 2025 | 7:53 PM

లెజెండ్ శరవణన్.. ఈయన చాలా ఫెమస్ గురూ.. చాలా మందికి ఈయన గురించి తెలిసే ఉంటుంది.  50ఏళ్ల వయసులో హీరో అవ్వాలనే కలను నెరవేర్చుకున్నాడు హీరో శరవణన్. ప్రముఖ వస్త్ర వ్యాపారం శరవణన్ స్టోర్స్ అధినేత అయిన ఈ శరవణన్. తన బ్రాండ్స్‌కు తానే మోడల్ గా మారి యాడ్స్ చేస్తూ పాపులర్ అయ్యాడు. స్టార్ హీరోయిన్స్ తో కలిసి యాడ్స్ చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ సమయంలో ట్రోల్స్ బారిన కూడా పడ్డాడు. ఎన్ని ట్రోల్స్ వచ్చినా కూడా ఆయన మాత్రం వెనకడుగు వేయలేదు. ఇదిలా ఉంటే దాదాపు 60 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియన్ లెవల్లో.. లెజెండ్‌ సినిమాను తెరకెక్కించి అందర్నీ షాక్ చేశారు. షాక్ చేయడమే కాదు.. ఆ సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్స్ ఇచ్చి మరీ స్టార్ టెక్నీషియన్లను తీసుకున్నాడు.

ఇది కూడా చదవండి : అప్పుడు ఎవడ్రా బిగ్ బాస్ అంది.. ఇప్పుడు ఓటేయమని కన్నీళ్లు పెట్టుకుంది

ఫైనల్ గా బెస్ట్ అవుట్‌ పుట్తో.. థియేటర్లలో రిలీజ్‌ చేసి.. అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ఈ సినిమాలో ఊర్వశి రౌతేలా లాంటి టాప్ బ్యూటీని హీరోయిన్ గా తీసుకున్నాడు. లెజెండ్ శరవణన్ హీరోగా వచ్చిన ది లెజెండ్ సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి సినిమాతోనే టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన ఆయన, ఇప్పుడు రెండో సినిమాతో మరో సెన్సేషన్‌కు రెడీ అవుతున్నారు. ఐదు పదుల వయసులో రొమాంటిక్ స్టార్ అనిపించుకునేందుకు తంటాలు పడుతున్నాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఆ హీరోయిన్ నాకు చెల్లెలు లాంటిది.. దుల్కర్ సల్మాన్ కామెంట్స్ వైరల్

త్వరలోనే ఓ యాక్షన్ రొమాంటిక్ కథతో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా కోసం భారీ తరగణాన్ని తీసుకోనున్నారట. హీరోయిన్ గా ఓ బాలీవుడ్ టాప్ బ్యూటీని కూడా పరిశీలిస్తున్నారట. తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్స్ గా పాయల్ రాజ్ పుత్ నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. అలాగే మరో హీరోయిన్ గా ఆండ్రియా నటిస్తున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే గతంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన నెక్స్ట్ సినిమాలో తాను మేకప్ లేకుండా కనిపిస్తాను అని చెప్పాడు. అలాగే రగడ లుక్ లో ఆ సినిమాలో కనిపిస్తాను అని చెప్పుకొచ్చాడు లెజెండ్ శరవణన్. అలాగే ఆ మూవీ కంటెంట్ ఓరియెంటడ్ సినిమా. అలాగే ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారని. ఆ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని తెలిపాడు లెజెండ్ శరవణన్.

ఇది కూడా చదవండి : బాలయ్యకు తల్లిగా , లవర్‌గా నటించిన యంగ్ బ్యూటీ.. ఆమె ఎవరో తెలుసా?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us