Ram Pothineni: స్పీడ్ పెంచిన ఎనర్జిటిక్ స్టార్.. మరో స్టార్ దర్శకుడికి రామ్ పోతినేని గ్రీన్ సిగ్నల్

|

Jun 28, 2022 | 9:58 AM

ఎనర్జిటిక్ స్టార్ రామ్ స్పీడ్ పెంచాడు.. బేక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు ఈ కుర్ర హీరో. ప్రస్తుతం రామ్ పోతినేని తమిళ్ దర్శకుడు లింగు స్వామి దర్శకత్వంలో 'ది వారియర్' అనే సినిమా చేస్తున్నాడు.

Ram Pothineni: స్పీడ్ పెంచిన ఎనర్జిటిక్ స్టార్.. మరో స్టార్ దర్శకుడికి రామ్ పోతినేని గ్రీన్ సిగ్నల్
Ram Pothineni
Follow us on

Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్ రామ్ స్పీడ్ పెంచాడు.. బేక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు ఈ కుర్ర హీరో. ప్రస్తుతం రామ్ పోతినేని తమిళ్ దర్శకుడు లింగు స్వామి దర్శకత్వంలో ‘ది వారియర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తెలుగుతోపాటు తమిళ్ లోనూ విడుదల కానుంది. ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమా తర్వాత మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో సినిమా చేస్తున్నాడు రామ్. ఇప్పటికే ఈ సినిమా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. రామ్ కోసం ఓ పవర్ఫుల్ స్టోరీని రెడీ చేశారట త్వరలోనే ఈ మూవీ షూటింగ్ మొదలు కానుంది.

ఇది రామ్ సోలో హీరోగా నటిస్తున్న మూవీ కాదని తమిళ క్రేజీ హీరో శివ కార్తీకేయన్ కూడా ఇందులో నటిస్తున్నారని టాక్ దాంతో ఇది మల్టీస్టారర్ గా తెరకెక్కించబోతున్నారని అర్ధమవుతోంది. అంతే కాకుండా ఈ మూవీలో హీరో రామ్ నటసింహం నందమూరి బాలకృష్ణ డైహార్డ్ ఫ్యాన్ గా కనిపించబోతున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు రామ్ మరో స్టార్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో రామ్ సినిమా చేయనున్నారని టాక్. ఇటీవలే హరీష్ శంకర్ రామ్ ను కలిసి కథ వినిపించారని, కథ బాగా నచ్చేసిందని చెబుతున్నారు. బోయపాటి సినిమా తర్వాత రామ్ నటించే మూవీ ఇదే అని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి