Vishwak Sen: విశ్వక్ సేన్ చేసిన పనిపై నెటిజన్స్ ప్రశంసలు.. హాట్యాఫ్ అంటూ పొగడ్తలు.. ఎందుకంటే..

ఇదిలా ఉంటే ప్రస్తుతం విశ్వక్ సేన్ తన సినిమా షూటింగ్స్ అంటూ చాలా బిజీగా ఉన్నారు. కానీ ఈ క్రమంలోనే తాజాగా విశ్వక్ చేసిన ఓ పని చూసి నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడి మంచి మనసు చూసి ఫిదా అవుతున్నారు. ఇంతకీ మాస్ కా దాస్ విశ్వక్ ఏం చేశాడో ఓసారి చూద్దాం.

Vishwak Sen: విశ్వక్ సేన్ చేసిన పనిపై నెటిజన్స్ ప్రశంసలు.. హాట్యాఫ్ అంటూ పొగడ్తలు.. ఎందుకంటే..
Actor Vishwak Sen
Follow us

|

Updated on: Jun 16, 2024 | 6:30 PM

మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. ఇప్పుడు వరుస హిట్స్ అందుకుంటూ ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఇటీవలే గామి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విశ్వక్..ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించాడు. ఇందులో నేహాశెట్టి, అంజలి కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పక్కా మాస్ క్యారెక్టర్‏లో అలరించారు విశ్వక్. ఇదిలా ఉంటే ప్రస్తుతం విశ్వక్ సేన్ తన సినిమా షూటింగ్స్ అంటూ చాలా బిజీగా ఉన్నారు. కానీ ఈ క్రమంలోనే తాజాగా విశ్వక్ చేసిన ఓ పని చూసి నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడి మంచి మనసు చూసి ఫిదా అవుతున్నారు. ఇంతకీ మాస్ కా దాస్ విశ్వక్ ఏం చేశాడో ఓసారి చూద్దాం.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విశ్వక్.. తాజాగా ఆర్గాన్ డొనేషన్ కు సంబంధించిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. మెట్రో రెట్రో పేరిట అవయవ దానంపై అవగాహన కార్యక్రమం శనివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వక్ అవయవ దానం గురించి తెలుసుకుని తాను కూడా అవయవ దానం చేస్తానని అప్పటికప్పుడు ప్రకటించారు. మరణించిన తర్వాత తన అవయవాలను దానం చేస్తానని రాసిచ్చాడు. మన అవయవ దానం వల్ల వేరొకరికి జీవితాన్ని ఇస్తామని తెలిసి తాను కూడా ఇందుకు ఓకే చెప్పినట్లు తెలిపాడు. దాత అనుమతి కార్డు పట్టుకుని విశ్వక్ దిగిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

విశ్వక్ సేన్ అవయవదానం చేశాడని తెలిసి ఫ్యాన్స్, నెటిజన్స్ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అవయవ దానం అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లి తాను కూడా అవయవదానం చేస్తానని వాగ్దానం చేసిన విశ్వక్ మంచి మనసు చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. విజయ్ దేవరకొండ, జగపతి బాబు, అమిర్ ఖాన్ తదితరులు అవయవదానం చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ సినిమాలో నటిస్తున్నారు.

Vishwak Sen

Vishwak Sen

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
తొడల కొవ్వును తగ్గించుకోవాలనుకుంటున్నారా? అత్యుత్తమ వ్యాయామాలు
తొడల కొవ్వును తగ్గించుకోవాలనుకుంటున్నారా? అత్యుత్తమ వ్యాయామాలు
కిడ్నీల ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్లు.. వెంటనే మానుకోండి
కిడ్నీల ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్లు.. వెంటనే మానుకోండి
విడాకుల బాటలో మరో స్టార్ కపుల్! ఇన్ స్టా నుంచి ఫొటోలు డిలీట్
విడాకుల బాటలో మరో స్టార్ కపుల్! ఇన్ స్టా నుంచి ఫొటోలు డిలీట్
డ్రమాటిక్ క్రైం స్టోరీ.. కూతురు ప్రేమ పెళ్లికి తండ్రి నిరాకరణ..
డ్రమాటిక్ క్రైం స్టోరీ.. కూతురు ప్రేమ పెళ్లికి తండ్రి నిరాకరణ..
ఫ్యాటీ లివర్‌ సమస్యతో బాధపడేవారు వీటిని పూర్తిగా మానేయాలి
ఫ్యాటీ లివర్‌ సమస్యతో బాధపడేవారు వీటిని పూర్తిగా మానేయాలి
వీటిని తింటే క్యాన్సర్‌ పక్కా..మృత్యువుకి చేరువ చేసే ఆహారాలు ఇవే!
వీటిని తింటే క్యాన్సర్‌ పక్కా..మృత్యువుకి చేరువ చేసే ఆహారాలు ఇవే!
మరోసారి టీమిండియాపై విషం కక్కిన పాక్ క్రికెటర్లు.. సంచలన ఆరోపణలు
మరోసారి టీమిండియాపై విషం కక్కిన పాక్ క్రికెటర్లు.. సంచలన ఆరోపణలు
మీరు రైల్లో నిద్రిస్తున్నారా? అయితే జరిమానా పడుద్ది..కొత్త రూల్స్
మీరు రైల్లో నిద్రిస్తున్నారా? అయితే జరిమానా పడుద్ది..కొత్త రూల్స్
స్మార్ట్‌వాచ్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి
స్మార్ట్‌వాచ్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి
ఆహారాల్లో కృత్రిమ రంగుల వాడకంపై కలవరం..! ఎంత ప్రమాదమో తెలుసా..
ఆహారాల్లో కృత్రిమ రంగుల వాడకంపై కలవరం..! ఎంత ప్రమాదమో తెలుసా..