Rashmika Mandanna: రష్మికతో సినిమా కోసం 25 కేజీలు బరువు పెరగుతున్న హీరో.. ఎవరో తెల్సా..?

|

Mar 02, 2024 | 12:13 PM

విక్కీ కౌశల్ తన తదుపరి చిత్రం ఛవా కోసం సిద్ధమవుతున్నాడు, ఇందులో అతను ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రను పోషిస్తున్నాడు. తాజా అప్‌డేట్‌లను బట్టి విక్కీ ఈ పాత్ర కోసం బరువు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఛవాలో ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్ర కోసం విక్కీ కౌశల్ 25 కిలోల బరువు పెరగనున్నట్లు తెలిసింది.

Rashmika Mandanna: రష్మికతో సినిమా కోసం 25 కేజీలు బరువు పెరగుతున్న హీరో.. ఎవరో తెల్సా..?
Rashmika Mandanna
Follow us on

విక్కీ కౌశల్ సినిమా రంగంలోకి వచ్చి చాలా ఏళ్లు అవుతోంది . ఈ మధ్య కాలంలో ఎన్నో విభిన్నమైన పాత్రలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇటీవల విడుదలైన ‘డంకీ’ సినిమాలో నటించాడు. ఈ సినిమాలో ఆయన అతిధి పాత్రలో కనిపించాడు. ఇప్పుడు 25 కిలోల బరువు పెరగాలని ప్లాన్ చేస్తున్నాడు. దీనికి కారణం .. రష్మిక మందన్నాతో కలిసి చేస్తోన్న తదుపరి చిత్రం. విక్కీ కౌశల్ ఎప్పుడూ హీరో అనే చట్రంలో ఇరక్కుపోలేదు. ఒక రకమైన పాత్రలకే పరిమితం కాలేదు. సపోర్టింగ్ రోల్ అయినా, సెకండ్ హీరో పాత్రలు వచ్చినా.. న్యాయం చేశాడు. ఇప్పుడు ఓ కొత్త సినిమా సైన్ చేశాడు. ఇందులో ఛత్రపతి శివాజీ కొడుకు ఛత్రపతి సాంబాజీ మహరాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటిస్తున్నాడు. ఈ పాత్ర కోసం ఆయన బరువు పెరగాల్సి ఉంది. రోల్‌కు న్యాయం చేసేందుకుగానూ విక్కీ కౌశల్..  దాదాపు 25 కిలోల బరువు పెరుగుతాడని అంటున్నారు.

5-10 కిలోల శరీర బరువు పెరగడం పెద్ద విషయం కాదు. అయితే ఒకేసారి 25 కిలోల బరువు పెరగడం అంత తేలికైన విషయం కాదు. అయితే అదే జరిగితే  మునుపెన్నడూ లేని విధంగా ఫ్యాన్స్ అతన్ని స్క్రీన్‌పై చూడబోతున్నారని స్పష్టం అవతుంది. విక్కీ కౌశల్ శరీరం బరువు పెరగడానికి డిఫరెంట్ డైట్ ఫాలో అవుతున్నాడట. అంతేకాదు జిమ్‌లో ఎక్కువ సమయం గడపుతున్నాడట. ఇందుకోసం ఇప్పటికే ట్రైనర్స్‌ను సైతం పెట్టుకున్నట్లు తెలిసింది. ఒక్కసారి బరువు పెరిగితే వేరే సినిమాలు చేయడానికి వీలుండదు.

ఈ సినిమాలో రష్మిక మందన్న కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె ఛత్రపతి సాంబాజీ మహారాజ్ భార్య పాత్రలో కనిపించనుంది. ఈ వార్త విని అభిమానులు థ్రిల్ అవుతున్నారు. ఆమె పాత్ర ఎలా ఉంటుందోనని ఆసక్తిగా అప్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రాథమిక పనులు జరుగుతున్నాయి. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.