Venu Swamy: కేసులు, అరెస్టులపై స్పందించిన వేణు స్వామి.. మరో వీడియో రిలీజ్

|

Aug 15, 2024 | 5:11 PM

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చిక్కుల్లో పడ్డారు. ఇకపై సెలబ్రిటీల జాతకాలను చెప్పనంటూ రెండు నెలల క్రితం సంచలన ప్రకటన చేసిన ఆయన ఇటీవల నాగ చైతన్య- శోభిత ధూళిపాళ్ల వైవాహిక బంధంపై జోస్యం చెప్పారు. గతంలో నాగ చైతన్య- సమంతల గురించి ఎలాంటి సంచలన కామెంట్స్ చేశారో ఇప్పుడు నాగ చైతన్య- శోభితలపై కూడా అలాంటి కామెంట్సే చేశారు.

Venu Swamy: కేసులు, అరెస్టులపై స్పందించిన వేణు స్వామి.. మరో వీడియో రిలీజ్
Venu Swamy, Naga Chaitanya, Sobhita Dhulipala
Follow us on

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చిక్కుల్లో పడ్డారు. ఇకపై సెలబ్రిటీల జాతకాలను చెప్పనంటూ రెండు నెలల క్రితం సంచలన ప్రకటన చేసిన ఆయన ఇటీవల నాగ చైతన్య- శోభిత ధూళిపాళ్ల వైవాహిక బంధంపై జోస్యం చెప్పారు. గతంలో నాగ చైతన్య- సమంతల గురించి ఎలాంటి సంచలన కామెంట్స్ చేశారో ఇప్పుడు నాగ చైతన్య- శోభితలపై కూడా అలాంటి కామెంట్సే చేశారు. దీంతో అక్కినేని అభిమానులు గురూజీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జర్నలిస్టు సంఘాలు కూడా స్వామీజీ ఫైర్ అయ్యాయి. ఆయనపై మహిళా కమిషన్‌కి ఫిర్యాదు చేశాయి. ఇక వేణు స్వామిని అరెస్ట్ చేయనున్నారంటూ సామాజిక మాధ్యమాలు, కొన్ని న్యూస్ ఛానెల్స్ ఊదరగొట్టేస్తున్నాయి. దీంతో ఈ కథనాలపై తాజాగా వేణుస్వామి స్పందించారు. ‘కేసులపై ఇప్పుడు నేనేమీ మాట్లాడను. సమయం తీసుకొని చాలా విషయాలు మాట్లాడాలి. మాట్లాడదాం.. తప్పకుండా అన్ని విషయాలు మాట్లాడాలి. కేసులు గట్రా అంటే హీరోయిన్లను, మా అసోసియేషన్‌ మెంబర్ అయిన ఓ నటిని కూడా ఈ మధ్య కాలంలో ఒక రాజకీయనేత బండ బూతులు తిట్టాడు. అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను ఎలా ఆడుకున్నారో అన్నీ చూశాం. నేను జాతకాలు చెబితేనే అరెస్టులు అంటే.. సరే ఎవరు కేసులు పెట్టారో నాకు అయితే తెలియదు. ఎవరో ఫోన్ చేసి గురువు గారు మీరు అరెస్ట్ అయ్యారంట అని అడిగితే లేదు నాయనా నేను నా ఆఫీసులోనే ఉన్నాను. ఇక్కడ పూజలు జరుగుతున్నాయని చెప్పాను’ అని చెప్పుకొచ్చారు గురూజీ.

నాగ చైతన్య-శోభితలపై కామెంట్స్ వ్యవహారంలో వేణు స్వామికి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. అయితే వేణు స్వామిపై కేసులపై ఆయన భార్య శ్రీవాణి ఘాటుగా స్పందించింది. మీడియా సంస్థలపై తీవ్రంగా మండి పడ్డారు. కాగా అంతకు ముందు నాగ చైతన్య- శోభితల జాతకం ఎందుకు చెప్పానో వేణు స్వామి ఒక వీడియో రిలీజ్ చేశారు. ‘ నేను ఇంతకు ముందు సమంత, నాగచైతన్య ల జాతకాన్ని చెప్పాను కాబట్టి దానికి కొనసాగింపుగానే నాగచైతన్య, శోభితల జాతకాన్ని చెప్పాను. అంతే తప్పా ఇంకేమీ లేదు. రెండు నెలల క్రితం నేను చెప్పినట్లుగా సెలబ్రిటీల జాతకాలు నేను చెప్పను. రాజకీయ విశ్లేషణలు కూడా చేయను. ఇప్పటికీ అదే మాట మీద ఉంటున్నాను. ఇదే విషయంపై మా అధ్యక్షులు మంచు విష్ణు కు కూడా ఫోన్ లో చెప్పాను. ఆయన తొందర్లోనే కలుద్దామన్నారు’ అంటూ వీడియోను రిలీజ్ చేశారు వేణు స్వామి.

ఇవి కూడా చదవండి

వేణు స్వామి పోస్ట్ చేసిన వీడియో ఇదిగో..


మొత్తానికి నాగ చైతన్య- శోభితలపై కామెంట్స్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయారు గురూజీ.

 

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.