Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చేసింది.. వెంకీ మరోసారి అదరగొట్టనున్నారుగా
ప్రస్తుతం వెంకటేష్ జోరు పెంచారు. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న వెంకటేష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో స్పెషల్ రోల్ చేశారు వెంకీ. సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆదర్శ కుటుంబం. ఇటీవలే వరుస సినిమాలతో వెంకీ దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన.. ఆతర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో గెస్ట్ రోల్ చేసి మెప్పించారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు ఆదర్శ కుటుంబం AK 47 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్..
B Gopal: తండ్రి కొడుకులను పెట్టి సినిమా చేశా.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది : బి. గోపాల్
ఒకొక్క గ్లింప్స్ ను విడుదల చేస్తూ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశారు మేకర్స్. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ ఆసక్తికరంగా కట్ చేశారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకీ తన కామెడీతో మరోసారి ఆకట్టుకోనున్నారని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. అలాగే ఈ టీజర్ లో వెంకీ కుటుంబం కోసం కష్టపడటం, భార్య అప్పులు చేయడం, ఆతర్వాత వెంకీకి లాటరీ తగలడం, కట్ చేస్తే లైఫ్ చేంజ్ అయిపోవడం చూపించారు. అంతలోనే తన ఫ్యామిలీకి ప్రమాదం రావడంతో హీరో యాక్షన్ మోడ్ లోకి దిగడం చూపించారు.
అప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పుడు సినిమాలు మానేసి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
టీజర్ చూస్తుంటే కథ సింపుల్ గా సాగిపోతుందని కానీ సినిమాలో ఉండే ఫన్ ఆకట్టుకుంటుందని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. ఈ సినిమాపై మొదటి నుంచి మంచి క్యూరియాసిటి నెలకొంది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఆదర్శకుటుంబం సినిమా టీజర్ పై మీరూ ఓ లుక్కేయండి.
నా కులం వాళ్లే కుట్ర చేశారు.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తామన్నారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరో
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




