AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood:ఎన్నాళ్లకెన్నాళ్లకు.. తిరుమల శ్రీవారి సేవలో అలనాటి హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

తిరుమల శ్రీవారిని ప్రతి రోజూ కోట్లాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఇందులో సామాన్యులతో పాటు సినిమా సెలబ్రిటీలు కూడా ఉంటారు. తరచూగా ఏడుకొండలవాడికి మొక్కులు సమర్పించుకుంటారు. అలా శనివారం (జులై 26) అలనాటి టాలీవుడ్ హీరోయిన్ తిరుమల శ్రీవారి సేవలో తరించింది.

Tollywood:ఎన్నాళ్లకెన్నాళ్లకు.. తిరుమల శ్రీవారి సేవలో అలనాటి హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actress
Basha Shek
|

Updated on: Jul 26, 2025 | 5:57 PM

Share

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఇప్పటితరానికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 90వ దశకంలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిందీ అందాల తార. శ్రీలంక రాజధాని కొలంబోలో పుట్టి పెరిగిందీ అందాల తార. తెలుగుతో పాటు తమిళ్ సినిమాల్లోనూ హీరోయిన్ గా మెరిసింది. నటించింది తక్కువ సినిమాలే అయినా తన అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుందీ అందాల తార. కేవలం సినిమాలే కాదు సీరియల్స్ బాగా చూసే వారికి కూడా ఈ ముద్దుగుమ్మ బాగా పరిచయమే. తెలుగులో పలు సూపర్ హిట్ సీరియల్స్ లో నటించి మెప్పించిందీ అందాల తార. ఇప్పటికీ కొన్ని తమిళ్ సీరియల్స్ లో రెగ్యులర్ గా కనిపిస్తోంది. తాజాగా ఈ సీనియర్ నటి శనివారం (జులై26) తిరుమలలో సందడి చేసింది. ఏడుకొండలవాడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంది. దీంతో ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు వైరలయ్యాయి. వీటిని చూసిన చాలా మంది ఆమెను గుర్తు పట్టలేకపోయారు? మరి మీరు గుర్తు పట్టారా? తను మరెవరో కాదు సింధూర పువ్వు హీరోయిన్ నిరోషా.

తెలుగులో సింధూర పువ్వు, నారీ నారీ నడుమ మురారి, కొబ్బరి బొండాం, స్టూవర్టుపురం పోలీస్‌ స్టేషన్‌, ముద్దుల మావయ్య, అత్తింట్లో అద్దె మొగుడు, ముగ్గురు అత్తల ముద్దుల అల్లుడు, డిటెక్టివ్ నారద, వన్ బై టూ, పచ్చని సంసారం, భలే ఖైదీలు తదితర సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది నిరోషా. అలాగే కొన్ని తమిళ్, మలయాళం సినిమాల్లోనూ నటించింది. అలాగే సీరియల్స్ విషయానికి వస్తే.. సుడి గుండాలు, ఇది కథ కాదు, మావిడాకులు, జనని, మనసా కవ్వించకే, కథ కాని కథ, దేవతలరా దీవించండి తదితర ధారావాహికలతో బుల్లితెర ఆడియెన్స్ కు చేరువైంది.

ఇవి కూడా చదవండి

నటి నిరోషా లేటెస్ట్ ఫొటోస్..

అన్నట్లు నిరోషా భర్త కూడా ప్రముఖ నటుడే. ఓసేయ్ రాములమ్మ వంటి పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన రాంకీని ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతను ఇప్పటికీ సినిమాల్లోనూ నటిస్తున్నాడు. ఇక నిరోషా ప్రస్తుతం కొన్ని తమిళ్ సీరియల్స్ లో మాత్రమే నటిస్తోంది.

కమల్ హాసన్ తో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్
పెళ్లింట తీరని విషాదం.. తల్లి, కూతురు ఆత్మహత్య
పెళ్లింట తీరని విషాదం.. తల్లి, కూతురు ఆత్మహత్య
బాబోయ్‌ భయంకరం.. వ్యక్తిని బంతిలా గాలిలోకి ఎగరేసి, కాళ్లతో తొక్కి
బాబోయ్‌ భయంకరం.. వ్యక్తిని బంతిలా గాలిలోకి ఎగరేసి, కాళ్లతో తొక్కి
శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో
శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో
కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!
కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!
పెళ్లి చేసుకునే వారికి కొత్త టెన్షన్.. వాటితో సంబంధం లేదంటున్న
పెళ్లి చేసుకునే వారికి కొత్త టెన్షన్.. వాటితో సంబంధం లేదంటున్న
డీమార్ట్ బంపర్ ఆఫర్.. ఇండక్షన్ స్టవ్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు..
డీమార్ట్ బంపర్ ఆఫర్.. ఇండక్షన్ స్టవ్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు..
ఈ కూరగాయలతో గిన్నెలు తోమండి… జిడ్డు పోయి మెరిసిపోవడం పక్కా
ఈ కూరగాయలతో గిన్నెలు తోమండి… జిడ్డు పోయి మెరిసిపోవడం పక్కా
గంభీర్ కు 2027 వన్డే ప్రపంచకప్పే అసలైన అగ్నిపరీక్ష : గంగూలీ
గంభీర్ కు 2027 వన్డే ప్రపంచకప్పే అసలైన అగ్నిపరీక్ష : గంగూలీ
ఏపీ టెన్త్ విద్యార్థులకు ఊరట.. నిమిషం నిబంధన ఎత్తివేత
ఏపీ టెన్త్ విద్యార్థులకు ఊరట.. నిమిషం నిబంధన ఎత్తివేత