D. Suresh Babu: నిర్మాతలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. ప్రభుత్వం పునరాలోచించాలి : సురేష్ బాబు

|

Nov 27, 2021 | 1:00 PM

ప్రస్తుతం టాలీవుడ్‌లో సినిమా టికెట్స్ రేట్స్ విషయం చర్చమశనీయంగా మారింది. ఇటీవలే ఏపీ ప్రభుత్వం ఇక నుంచి ఏపీ సినిమా హాళ్లలో కేవలం నాలుగు షో లే వేయాలని..

D. Suresh Babu: నిర్మాతలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. ప్రభుత్వం పునరాలోచించాలి : సురేష్ బాబు
Suresh Babu
Follow us on

D. Suresh Babu: ప్రస్తుతం టాలీవుడ్‌లో సినిమా టికెట్స్ రేట్స్ విషయం చర్చమశనీయంగా మారింది. ఇటీవలే ఏపీ ప్రభుత్వం ఇక నుంచి ఏపీ సినిమా హాళ్లలో కేవలం నాలుగు షో లే వేయాలని.. అదనపు షోలకు అవకాశం లేదు అని స్పష్టం చేసింది. చిన్న సినిమా,పెద్ద సినిమా తేడా లేదు…కేవలం నాలుగు షో లు మాత్రమే వేయాలని అందేవిధంగా అన్ని సినిమాలకు ఒకే టికెట్ రేట్ ఉండాలని నిర్ణయించింది. దీనిపై మిశ్రమ స్పందన వస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా  సినిమ టిక్కెట్ రేట్స్ విధానం పై ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు స్పందించారు. ప్రస్తుత టిక్కెట్ రేట్లు వల్ల నిర్మాత లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు.

సురేష్ బాబు మాట్లాడుతూ.. టిక్కెట్ రేట్లు వల్ల నిర్మాతలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని..టిక్కెట్ రేట్లు పై ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలని అన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్లకు రావడం మే చాలా కష్టంగా ఉందన్నారు సురేష్ బాబు. అలాగే బి, సి సెంటర్స్ లో కనీసం కరెంటు చార్జీలు కూడా వచ్చే అవకాశాలు లేవని అన్నారు. సినిమా నిర్మించిన నిర్మాత కు దాని ధర నిర్ణయంచుకునే అవకాశం ఉండాలని సురేష్ బాబు అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులకు అనేక రకాలైన వినోదాలు అందుబాటులో ఉన్నాయి.. కావున టిక్కెట్ రేట్లు పై ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలని  సురేష్ బాబు కోరారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

KS Nageswara Rao: ప్రముఖ సినీ దర్శకుడు కన్నుమూత.. విషాదంలో టాలీవుడ్..

Hari Hara Veera Mallu : తిరిగి పట్టాలెక్కనున్న పవన్ – క్రిష్ సినిమా.. ఎప్పడినుంచి అంటే.

Chiranjeevi: మరోసారి కలిసి నటించనున్న మెగాస్టార్- మెగాపవర్ స్టార్.. ఏ సినిమాలో అంటే..