షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోయిన్ గా మారిన భామల్లో ప్రియాంక జవల్కర్ ఒకరు. ఈ చిన్నది షార్ట్ ఫిలిమ్స్ నుంచి కెరిర్ ప్రారంభించి హీరోయిన్ గా మారింది. తొలి సినిమానే స్టార్ హీరో విజయ్ దేవరకొండ సరసన ఛాన్స్ దక్కించుకుంది. విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాల సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆతర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఎస్ ఆర్ కల్యాణమండపం సినిమాలో నటించింది. ఆతర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించింది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో దర్శక నిర్మాతలను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ప్రియాంకతో పాటు మరికొంతమంది కూడా తమ గ్లామరస్ ఫోటోలను షేర్ చేశారు.