రూ. 65కోట్లు పెడితే.. రూ.10 కోట్లు కూడా రాలేదు.. డిజాస్టర్ దెబ్బకు హీరో రూపాయి కూడా తీసుకోలేదు

ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ నడుస్తుంది.. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుంది. ఇటీవల తెరకెక్కిన సినిమాలన్నీ పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అవుతూ సందడి చేస్తున్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేదు. అన్ని సినిమాలు మూడు నాలుగు భాషల్లో విడుదలవుతున్నాయి.

రూ. 65కోట్లు పెడితే.. రూ.10 కోట్లు కూడా రాలేదు.. డిజాస్టర్ దెబ్బకు హీరో రూపాయి కూడా తీసుకోలేదు
Movie

Updated on: Aug 25, 2026 | 10:52 AM

టాలీవుడ్ లో వరుస హిట్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రస్తుతం థియేటర్స్ లో ఇరుముడి సినిమా దూసుకుపోతుంది. రవితేజ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. అలాగే మరికొన్ని రోజుల్లో టాక్సిక్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ఇండస్ట్రీలో హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా కొంతమంది హీరోలు వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇటీవల సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు చాలానే ఉన్నాయి. కాగా కొన్ని ప్రేక్షకులను దారుణంగా నిరాశపరుస్తున్నాయి.

అసలు ఆ సినిమా చేయాలనుకోలేదు.. అనుకోకుండా చేశాం..! పెద్ద హిట్ అయ్యింది

భారీ స్టార్ కాస్ట్ ఉండి, భారీగా ప్రమోషన్స్ చేసుకున్నప్పటికీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతుంటాయి. వాటిలో ఈ సినిమా ఒకటి. ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. అంతే కాదు ఓటీటీలోకి కూడా చాలా లెట్ గా వచ్చింది. మాములు లెట్ కాదు.. ఓటీటీలోకి రావడానికి ఏకంగా 2 ఏళ్లు పట్టింది. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. ఏకంగా సిక్స్ ప్యాక్ బాడీను కూడా పెంచాడు. అలాగే లాంగ్ హెయిర్ తో డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. అయితే ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది.

మహేష్ బాబుకు అమ్మగా నటించాలని ఉంది.. ఆ ఛాన్స్ ఎప్పుడొస్తుందో.!

2023లో అఖిల్ ఏజెంట్ సినిమా విడుదలైంది. ఇదిలా ఉంటే ఏజెంట్ సినిమా ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూశారు. నెలలు గడుస్తున్నా ఆ సినిమా ఓటీటీలోకి రాలేదు. చివరకు రెండేళ్ల తర్వాత ఏజెంట్ సినిమా 2025 మార్చ్ 14న ఓటీటీలోకి వచ్చింది. ఏజెంట్ ఓటీటీ రిలీజ్ ఆలస్యం పై రకరకాల వార్తలు వచ్చాయి. కానీ ఓటీటీలోనూ ఈ సినిమాను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. ఈ సినిమాను రూ.65కోట్లు పెట్టి తీశారు..రూ.10కోట్లు కూడా రాలేదు. సినిమా డిజాస్టర్ అవ్వడంతో హీరో అఖిల్ ఒక్కరూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదు. రీసెంట్ గా లెనిన్ సినిమాతో హిట్ అందుకున్నాడు అఖిల్. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది.

ఇవి కూడా చదవండి

చూడటానికి అలా ఉంటుంది కానీ.. ఆమెకు పొగరెక్కువ..! సాయి పల్లవి నిజస్వరూపం ఇదే అంటున్న యంగ్ హీరో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Loading...
Unable to load recommendations.
Follow Us