Tollywood: ఎలా ఉండేది ఎలా మారిపోయింది.. ఇప్పుడు పాలరాతి బొమ్మే

ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా...? పాత ఫోటో చూసి.. ఇప్పటి లుక్ చూస్తే కనీసం పోల్చుకోలేరు కూడా. ఇప్పుడు హీరోయిన్ల కంటే అందంగా తయారయ్యింది. ఇప్పటికీ మ్యారేజ్ అవ్వలేదు. దీంతో మీకు భర్త అవ్వాలంటే ఏయే క్వాలిటీస్ ఉండాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. తనెవరో గుర్తుపట్టారా... ?

Tollywood: ఎలా ఉండేది ఎలా మారిపోయింది.. ఇప్పుడు పాలరాతి బొమ్మే
Singer Old Photo
Follow us

|

Updated on: Apr 25, 2024 | 12:27 PM

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు సింగర్స్‪కి కొదవ లేదు. గాన గాంధర్వుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి ప్రొద్భలంతో అని ఎంతోమంది అద్భుతమైన గాయనీ గాయకులుగా రాటుదేలారు. పదులు సంఖ్యలో తెలుగు రాష్ట్రాలు గాయనీ, గాయకులను ప్రొడ్యూస్ చేశాయంటే..బాలు గారు అన్నీ తానై నడిపించిన పాడుతా తీయగా ప్రొగ్రాం వల్లనే అని నిరభ్యంతరంగా చెప్పొచ్చు. ప్రతిభ ఉండటం వేరు.. ఆ ప్రతిభకు సానబెట్టి.. మేటిగా తయారు చేయడం వేరు. ఆ ప్రాసెస్ కోసం పాడుతా తీయగా చాలా బాగా ఉపయోగపడింది. ప్రజంట్ టాలీవుడ్‌‪లో తన మార్క్ వాయిస్‫తో దుమ్మురేపుతున్నారు‫ రమ్య బెహరా. ఈ యువ గాయని గుంటూరు జిల్లా నరసరావుపేటలో 1994, ఫిబ్రవరి 1 జన్మించింది. పెరిగింది మాత్రం భాగ్యనగరంలోనే. ఈమెకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. రమ్య బెహరా రామాచారి గారి వద్ద సంగీతంలో ఓనమాలు నేర్చుకుంది. ఆపై వివిధ సాంగ్ కాంపిటీషన్స్‫లో పాల్గొని మంచి పేరు సంపాదించుకుంది. టీవీ ప్రొగ్రామ్స్‌ ద్వారా తన వాయిస్ మాధుర్యం ఏంటో ప్రపంచానికి చూపించింది. దేశ, విదేశీ సంగీత కచేరిల్లో పాల్గొని.. మధురమైన గాత్రంతో శ్రోతలను అలరించింది.  ఈ క్రమంలో దిగ్గజ కంపోజర్ కీరవాణి గారి మెప్పు పొంది.. ఆయన సారధ్యంలో ఎన్నో గొప్ప పాటలను పాడింది. కీరవాణే రమ్య బెహరాను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. వెంగమాంబ చిత్రం ఇండస్ట్రీలో ఆమె పాటల ప్రయాణం ప్రారంభమైంది. ఆపై లచ్చిందేవికి ఓ లెక్కుంది,   బాహుబలి ది బిగినింగ్, టెంపర్, ఒక లైలా కోసం, కృష్ణాష్టమి, బ్రూస్ లీ, ప్రేమకథా చిత్రం, లౌక్యం, కొత్తజంట, ఇస్మార్ట్ శంకర్, చిన్నదాన నీకోసం, దిక్కులు చూడకు రామయ్య, రెడ్, రంగ్ దే, శతమానం భవతి, స్కంద  చిత్రాలలో మంచి పాటలు పాడింది. ఈమె ప్రస్తుతం కొన్ని హిందీ. కన్నడ, తమిళ్ సినిమాలలో కూడా పాడుతుంది.

అద్భుతమైన గాత్రం మాత్రమే కాదు.. ముగ్ధుల్ని చేసే సౌంధర్యం కూడా రమ్య బెహరా సొంతం. అందుకే ఆమెను యువకులు బాగా లైక్ చేస్తారు. కాగా రమ్య బెహరా టీన్ ఏజ్లో ఓ పాటల పోటీల కార్యక్రమంలోని ఫోటో ప్రజంట్ వైరల్ అవుతోంది. ఆ ఫోటో చూసిన నెటిజన్లు అసలు గుర్తించలేకపోతున్నారు. ఈమె మన రమ్య బెహరానేనా.. వాటే ఛేంజ్ అని కామెంట్లు పెడుతున్నారు.

View this post on Instagram

A post shared by Ramya Behara (@ramyabehara)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ