AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Paradise: ‘ది ప్యారడైజ్’ కి సంపూర్ణేష్ బాబు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? స్వయంగా చెప్పిన బర్నింగ్ స్టార్

దసరా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వచ్చిన సినిమా ' ది ప్యారడైజ్'. సెప్టెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇప్పటికే రూ. 160 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.

The Paradise: 'ది ప్యారడైజ్' కి సంపూర్ణేష్ బాబు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? స్వయంగా చెప్పిన బర్నింగ్ స్టార్
Actor Sampoornesh Babu
Basha Shek
|

Updated on: Oct 01, 2026 | 6:27 PM

Share

న్యాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన లేటేస్ట్ పీరియాడికల్ యాక్షన్‌ మూవీ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు మిక్స్ డ్ టాక్ వచ్చినా ఈ సినిమాకు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు రూ. 160 కోట్లకు పైగాకలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఒక్క తెలుగులోనే కాదు ఇతర భాషల్లోనూ నాని సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ లో ది ప్యారడైజ్ సినిమాకు రికార్డు వసూళ్లు వస్తున్నాయి. కాగా మాస్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ది ప్యారడైజ్ సినిమాలో భారీ తారగణమే ఉంది. నాని సరసన కయాదు లోహర్ కథానాయిక గా చేసింది. అలాగే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు శికంజా మాలిక్ అనే కరడుగట్టిన విలన్ పాత్రలో భయపెట్టాడు. వీరితో పాటు కామెడీ హీరో, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా ది ప్యారడైజ్ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించాడు. బిర్యానీ అనే ఓ డిఫరెంట్ పాత్రలో ఆడియెన్స్ ను మెప్పించాడు. ఈ నేపథ్యంలో నాని సినిమా కోసం సంపూ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడన్నది ఆసక్తికరంగా మారింది.

కాగా ది ప్యారడైజ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా సంపూర్ణేష్ బాబు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన రెమ్యూనరేషన్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. గతం లో తాను హీరోగా చేసినప్పుడు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చేవారో, ది ప్యారడైజ్ సినిమాకు అంతకు మూడు రెట్లు రెమ్యూనరేషన్ ఇచ్చారని సంపూ చెప్పుకొచ్చాడు. గతంలో ఒక్కో సినిమాకు కోటి రూపాయలు పైనే పారితోషికం తీసుకున్నాడు బర్నింగ్ స్టార్. ఈ నేపథ్యంలో ది ప్యారడైజ్ సినిమా కోసం సంపూ సుమారు రూ. 3 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

ది ప్యారడైజ్ సక్సెస్ టూర్ లో హీరో నాని..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us