The Kerala Story: 5 రోజుల్లోనే 50 కోట్ల క్లబ్‌లోకి.. ‘ది కేరళ స్టోరీ’ మైండ్ బ్లోయింగ్ కలెక్షన్లు..

|

May 11, 2023 | 6:00 AM

ఎన్నో వివాదాల నడుమ.. మరెన్నో అల్లర్ల నడుమ.. దేశవ్యాప్తంగా విడుదలైన 'ది కేరళ స్టోరీ' సినిమా.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

The Kerala Story: 5 రోజుల్లోనే 50 కోట్ల క్లబ్‌లోకి.. ది కేరళ స్టోరీ మైండ్ బ్లోయింగ్ కలెక్షన్లు..
The Kerala Story
Follow us on

ఎన్నో వివాదాల నడుమ.. మరెన్నో అల్లర్ల నడుమ.. దేశవ్యాప్తంగా విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమాపై బ్యాన్‌, పార్షల్ బ్యాన్ లాంటి అస్త్రాలు ప్రయోగించినా.. కలెక్షన్స్‌లో దూసుకుపోతూనే ఉంది. ఓవరాల్‌గా.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అనే టాక్ తెచ్చుకోవడమే కాదు.. జస్ట్ 5 రోజుల్లోనే.. 50 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టేసింది కేరళ స్టోరీ సినిమా..!

ఎస్.! సుదీప్తో సేన్ దర్శకత్వంలో.. అదా శర్మ లీడ్‌ రోల్‌లో తెరకెక్కిన ‘ది కేరళ స్టోరీ’ సినిమా.. రోజు రోజుకూ.. తన కలెక్షన్స్‌ను పెంచేసుకుంటోంది. ఈ సినిమాకు వ్యతిరేకంగా.. వివాదాలు చుట్టుముడుతున్నా.. అల్లర్లు చెలరేగుతున్నా.. కలెక్షన్స్‌లో దూకుడుగా.. దూసుకుపోతోంది. ఇక మే 5 న రిలీజ్ అయిన ఈ సినిమా.. ఫస్డ్ డే రూ. 8 కోట్లను వసూలు చేయగా.. రెండు రోజు దానికి మించేలా.. రూ. 11.22 కోట్లను రాబట్టింది.

ఇక మూడో రోజు రూ. 16.40 కోట్లు.. కలెక్ట్ చేసిన ఈ సినిమా… నాలుగో రోజు రూ. 10.07 కోట్లు.. ఐదో రోజు రూ. 11.14 కోట్లు తెచ్చుకుంది. ఇక ఈ మొత్తాన్ని కలిపి చూస్తే.. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా రూ. 56.86 కోట్లు కలెక్ట్ చేసింది. అందర్నీ ఒక్కసారిగా షాకయ్యేలా చేసింది. ప్రొడ్యూసర్లకు లాభాల పంట పండిస్తూనే… ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ మూవీగా ట్యాగ్ తెచ్చుకుంది.