నేను ఓ మగాడితో నటించా: వరలక్ష్మీకి-హీరో విమల్ సెటైర్

వరలక్ష్మీ శరత్‌కుమార్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో వార్తల్లో నిలుస్తారు. ఇప్పుడు ఆమె మరోసారి వార్తల్లోకెక్కారు. ఆ సరదా వ్యాఖ్య కాస్తా.. హాట్‌ చర్చగా మారింది. అందరినీ నవ్వులు పూయిస్తోంది. హీరో విమల్, వరలక్ష్మీ కలిసి తాజాగా.. ‘కాన్ని రాశి’ అనే సినిమాలో నటించారు. తాజాగా.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. హీరో విమల్.. హీరోయిన్ వరలక్ష్మీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వరలక్ష్మీ.. సినిమా సెట్‌లో మీతో ఎలా ఉన్నారు అన్న ప్రశ్నకు.. విమల్ సమాధానమిస్తూ.. ఇన్ని […]

నేను ఓ మగాడితో నటించా: వరలక్ష్మీకి-హీరో విమల్ సెటైర్
TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 14, 2019 | 11:59 AM

వరలక్ష్మీ శరత్‌కుమార్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో వార్తల్లో నిలుస్తారు. ఇప్పుడు ఆమె మరోసారి వార్తల్లోకెక్కారు. ఆ సరదా వ్యాఖ్య కాస్తా.. హాట్‌ చర్చగా మారింది. అందరినీ నవ్వులు పూయిస్తోంది.

హీరో విమల్, వరలక్ష్మీ కలిసి తాజాగా.. ‘కాన్ని రాశి’ అనే సినిమాలో నటించారు. తాజాగా.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. హీరో విమల్.. హీరోయిన్ వరలక్ష్మీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వరలక్ష్మీ.. సినిమా సెట్‌లో మీతో ఎలా ఉన్నారు అన్న ప్రశ్నకు.. విమల్ సమాధానమిస్తూ.. ఇన్ని సినిమాల్లో తాను ఫస్ట్‌టైం ఓ మగాడికి జోడీగా నటించానని సరదాగా.. వరలక్ష్మీని ఉద్దేశించి మాట్లాడారు. వరలక్ష్మీతో కలిసి వర్క్ చేసేటప్పుడు తనకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదని చెప్పాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై విమల్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu