
తమిళ్ స్టార్ హీరో ధనుష్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. కేవలం కోలీవుడ్‌లో మాత్రమే కాకుండా.. టాలీవుడ్, బాలీవుడ్లో ధనుష్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇటీవల ఆత్రంగి రే సినిమాతో ప్రేక్షకులను అలరించాడు ఈ స్టార్. తాజాగా తన భార్య సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యతో విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. సోమవారం రాత్రి పదకొండు గంటల సమయంలో ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ తాము విడాకులు తీసుకున్నట్లుగా తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలియజేశారు. దీంతో అటు రజినీ కాంత్, ధనుష్ అభిమానులు షాకయ్యారు. ఆకస్మాత్తుగా ధనుష్, ఐశ్వర్య తమ వైవాహిక జీవితానికి ముగింపు పలకడం పట్ల అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ధనుష్, ఐశ్వర్య రజనీ కాంత్‌లకు సంబంధించిన జ్ఞాపకాలను షేర్ చేస్తూ గుండె పగిలిందంటూ ట్వీట్స్ చేస్తున్నారు..
ట్వీట్స్..
మరికొందరు ఈ జంట తీసుకున్న నిర్ణయం పూర్తిగా వారి వ్యక్తిగతమని.. అందులోకి ఇతరులు తలదూర్చవద్దంటూ నెటిజన్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ట్వీట్
ఇక మరికొందరు మాత్రం ధనుష్, ఐశ్వర్య తీసుకున్న నిర్ణయం రజినీకాంత్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది.. ఇలాంటి సమయంలో స్ట్రాంగ్ గా ఉండాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు..
Radhe Shyam: మార్చిలో సందడి చేయనున్న రాధేశ్యామ్.? నెట్టింట వైరల్ అవుతోన్న విడుదల తేదీ..
Dhanush-Aishwaryaa: ఆ ఇద్దరినీ ఒకటి చేసిన సినిమా.. ఐశ్యర్య, ధనుష్‌ల అందమైన లవ్ స్టోరీ..