Nayanthara: అప్పుడు తీసేశారు.. ఇప్పుడు తీసుకొచ్చారు.. ఓటీటీలోకి నయనతార వివాదాస్పద సినిమా.. కానీ

నయనతార నటించిన తమిళ చిత్రం 'అన్నపూర్ణి' డిసెంబర్ 2023లో విడుదలైంది. అయితే సినిమాలో కొన్ని సన్నివేశాలు హిందువుల మత మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శలు కూడా వినిపించాయి. దాంతో ‘అన్నపూర్ణి’ సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫాం నుంచి తొలగించారు.

Nayanthara: అప్పుడు తీసేశారు.. ఇప్పుడు తీసుకొచ్చారు.. ఓటీటీలోకి నయనతార వివాదాస్పద సినిమా.. కానీ
Nayanthara
Follow us

|

Updated on: Aug 09, 2024 | 7:56 AM

లేడీ సూపర్ స్టార్ నయనతార ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆమె సినిమాలు కొన్ని వివాదాల్లోనూ ఇరుక్కున్నాయి. ఆమె నటించిన సినిమాలో అన్నపూర్ణి ఒకటి. నయనతార నటించిన తమిళ చిత్రం ‘అన్నపూర్ణి’ డిసెంబర్ 2023లో విడుదలైంది. అయితే సినిమాలో కొన్ని సన్నివేశాలు హిందువుల మత మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శలు కూడా వినిపించాయి. దాంతో ‘అన్నపూర్ణి’ సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫాం నుంచి తొలగించారు. ఇప్పుడు మళ్లీ ఈ చిత్రం ఓటీటీలో వీక్షించడానికి అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది.

‘అన్నపూర్ణి’ సినిమా టైటిల్‌ను బట్టి ఇది భోజనాలు, వంటకు సంబంధించిన కథ ఇది అని అర్ధమవుతోంది. ఈ చిత్రానికి ‘ది గాడెస్ ఆఫ్ ఫుడ్’ అనే ట్యాగ్‌లైన్ కూడా ఉంది. ఈ సినిమాలో లవ్ జిహాద్ అంశాలు ఉన్నాయని కొందరు ఆరోపించడంతో నిర్మాత క్షమాపణలు చెప్పారు. అలాగే కొన్ని మార్పులు కూడా చేయనున్నట్లు తెలిపారు.

ఇప్పుడు మళ్లీ నెట్‌ఫ్లిక్స్‌లో ‘అన్నపూర్ణి’ సినిమా ప్రసారానికి సన్నాహాలు జరిగాయి. ఆగస్ట్ 9 నుంచి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్విస్ట్ ఏమిటంటే ఇది ఇండియాలో ప్రసారం కాదు! ‘అన్నపూర్ణి’ సినిమా ఇతర దేశాల్లో చూడవచ్చు. మరి చిత్రబృందం ఏమైనా మార్పులు చేసిందా లేదా అన్నది ఆగస్ట్ 9న తేలనుంది. 2023లో ‘అన్నపూర్ణి’ సినిమా వివాదంలో చిక్కుకున్నప్పుడు నటి నయనతార ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సినిమా ఉద్దేశ్యం ప్రజల్లో స్ఫూర్తి నింపడమే తప్ప ఎవరినీ నొప్పించకూడదని ఆమె తెలిపింది. ఈ చిత్రానికి నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. ప్రముఖ కన్నడ నటుడు అచ్యుత్ కుమార్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

పశువుల పాకలో చిరుత డెలివరీ.. స్థానికుల రక్షణలో 3 పసికూనలు.!
పశువుల పాకలో చిరుత డెలివరీ.. స్థానికుల రక్షణలో 3 పసికూనలు.!
ఒకటోసారి.. రెండోసారి.. పోలీస్‌స్టేషన్‌లో పందెంకోళ్ల వేలం.
ఒకటోసారి.. రెండోసారి.. పోలీస్‌స్టేషన్‌లో పందెంకోళ్ల వేలం.
భారత్ పై చైనా వాటర్ బాంబ్.! ఎక్కడ ప్రయోగించారంటే..
భారత్ పై చైనా వాటర్ బాంబ్.! ఎక్కడ ప్రయోగించారంటే..
అది నిజం కావాలని ఆశిద్దాం.! పవన్ , రవితేజ పై డైరెక్టర్ కామెంట్స్.
అది నిజం కావాలని ఆశిద్దాం.! పవన్ , రవితేజ పై డైరెక్టర్ కామెంట్స్.
బరువెక్కిన హృదయంతో అభిమానులకు బహిరంగ లేఖ.!
బరువెక్కిన హృదయంతో అభిమానులకు బహిరంగ లేఖ.!
నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకుపోతున్న జక్కన్న డాక్యుమెంటరీ.! ట్రేండింగ్
నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకుపోతున్న జక్కన్న డాక్యుమెంటరీ.! ట్రేండింగ్
కాలి నడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అల్లు స్నేహ & పిల్లలు
కాలి నడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అల్లు స్నేహ & పిల్లలు
నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థంపై స్పందన. వీడియో వైరల్
నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థంపై స్పందన. వీడియో వైరల్
బిగ్ అప్డేట్.! ఇక డ్రాగన్ రాక లాంఛనమే.. షూటింగ్ మొదలు అప్పుడే.!
బిగ్ అప్డేట్.! ఇక డ్రాగన్ రాక లాంఛనమే.. షూటింగ్ మొదలు అప్పుడే.!
ఘోర అపచారం.. గర్భగుడిలో మూల విరాట్‌తో పాటు దర్శన్‌కు అభిషేకం.!
ఘోర అపచారం.. గర్భగుడిలో మూల విరాట్‌తో పాటు దర్శన్‌కు అభిషేకం.!