Jio Bharat Phone: ఇదేం క్రేజ్‌ భయ్యా.. 50శాతం వాటా జియో భారత్‌ ఫోన్‌దే.. మరీ ఇంత డిమాండా?

జియో భారత్‌ కీ ప్యాడ్‌ ఫోన్‌ కూడా అదే స్థాయిలో సంచలనాలను నమోదు చేస్తోంది. కేవలం జియో 4జీ నెట్‌ వర్క్‌ పై ఆధారపడి పని చేసే ఈ ఫోన్‌ ధర రూ. 999. ఇది ఇప్పుడు భారతీయ మార్కెట్‌ని శాసించే స్థాయికి చేరుకుంది. రూ. 1000 ఫోన్‌ ధర సెగ్మెంట్లో ఈ జియో భారత్‌ ఒక్కటే 50శాతానికి పైగా వాటాను కలిగి ఉంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తాజాగా విడుదల చేసిన 2024 వార్షిక నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.

Jio Bharat Phone: ఇదేం క్రేజ్‌ భయ్యా.. 50శాతం వాటా జియో భారత్‌ ఫోన్‌దే.. మరీ ఇంత డిమాండా?
Reliance Jio Bharat
Follow us

|

Updated on: Aug 09, 2024 | 7:41 AM

రిలయన్స్‌ జియో.. భారతీయ టెలికాం మార్కెట్లో ఓ ట్రెండ్‌ సెట్టర్‌ అని చెప్పొచ్చు. ఇంటర్నెట్‌ వినియోగాన్ని మారుమూల గ్రామానికి కూడా తీసుకెళ్లి ఓ సరికొత్త విప్లవానికి నాంది పలికింది. డిజిటల్‌ ఇండియా నినాదాన్ని ముందుకు తీసుకెళ్లడంలో బాగా ఉపయోగపడింది. అదే జియో నుంచి గతేడాది విడుదలైన జియో భారత్‌ కీ ప్యాడ్‌ ఫోన్‌ కూడా అదే స్థాయిలో సంచలనాలను నమోదు చేస్తోంది. కేవలం జియో 4జీ నెట్‌ వర్క్‌ పై ఆధారపడి పని చేసే ఈ ఫోన్‌ ధర రూ. 999. ఇది ఇప్పుడు భారతీయ మార్కెట్‌ని శాసించే స్థాయికి చేరుకుంది. రూ. 1000 ఫోన్‌ ధర సెగ్మెంట్లో ఈ జియో భారత్‌ ఒక్కటే 50శాతానికి పైగా వాటాను కలిగి ఉంది. ఈ మేరకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రకటించింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తాజాగా విడుదల చేసిన 2024 వార్షిక నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇది చాలా పెద్ద అచీవ్‌మెంట్‌గా మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ట్రెండ్‌ సెట్టర్‌..

సాధారణంగా స్మార్ట్‌ ఫోన్లో అనేక ఫీచర్లు మనకు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా సోషల్‌ మీడియా, యూట్యూబ్‌, ఎక్స్‌ వంటి సాధనాలు దానిలో ఉంటాయి. అయితే రిలయన్స్‌ ఫీచర్‌ ఫోన్లోనే ఈ స్మార్ట్‌ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. జియో భారత్‌ కీ ప్యాడ్‌ ఫోన్లోనే వాట్సాప్‌, యూ ట్యూబ్‌ వంటి వాటితో పాటు జియోభారత్‌ యూపీఐ, జియో సినిమా, జియో టీవీ వంటి వాటికి యాక్సెస్‌ నుంచి ఇచ్చింది. పైగా ఈ ఫోన్‌ వాడేవారికి రీచార్జి ప్లాన్లు కూడా చాలా తక్కువ ధరకే అందిస్తోంది. ఇటీవల అన్ని టెలికాం క్యారియర్లతో పాటు జియో కూడా తమ ప్లాన్ల ట్యారిఫ్‌ను పెంచినా.. ఈ జియో భారత్‌ ప్లాన్లను మాత్రం పెంచలేదు. ప్రస్తుతం జియోభారత్‌ యూజర్లు నెలకు కేవలం రూ. 123తో పూర్తి డిజిటల్‌ సేవలను ఆస్వాదిస్తున్నారు. ఇతర ఆపరేటర్లు ఇదే ప్యాకేజీని రూ. 199 నుంచి ప్రారంభిస్తుండటం గమనార్హం.

ముఖేష్‌ అంబానీ లేఖ..

వార్షిక నివేదిక విడుదల చేసిన సందర్భంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ షేర్‌ హోల్డర్లకు ఓ లేఖ రాశారు. దానిలో ఆయన మన దేశంలో 2జీ నుంచి 4జీకి ఆ తర్వాత 5జీకి అప్‌ డేట్‌ కావడానికి జియో భారత్‌ చాలాకీలకంగా పనిచేసిందన్నారు. 2016లో జియో 4జీని తీసుకొచ్చి దేశంలోకి డిజిటల్‌ ఇన్‌క్లూజన్‌ చేశామన్నారు. జియో డేటా డార్క్‌ ఇండియాను డేటా రిచ్‌ నేషన్‌గా మార్చిందని చెప్పారు. ప్రతి ఇంటికీ అతి తక్కువ ధరలో హై స్పీడ్‌ 4జీ డేటాను అందించినట్లు ఆ లేఖలో చెప్పుకొచ్చారు. ఇప్పుడు జియో తన ట్రూ 5జీ నెట్‌వర్క్‌ను తీసుకొచ్చినట్లు చెప్పారు. అతి తక్కువ సమయంలోనే 5జీ సర్వీసెస్‌ను భారతదేశం అంతటా విస్తరించినట్లు పేర్కొన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇదేం క్రేజ్‌ భయ్యా.. ఆ ఫోన్‌కు మరీ ఇంత డిమాండా?
ఇదేం క్రేజ్‌ భయ్యా.. ఆ ఫోన్‌కు మరీ ఇంత డిమాండా?
తెలంగాణ వైపు టీడీపీ చూపు.. పార్టీ బలోపేతంపై సీఎం చంద్రబాబు ఫోకస్
తెలంగాణ వైపు టీడీపీ చూపు.. పార్టీ బలోపేతంపై సీఎం చంద్రబాబు ఫోకస్
భలే మంచి రోజు.. స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధర.. తులం ఎంతంటే.?
భలే మంచి రోజు.. స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధర.. తులం ఎంతంటే.?
వేల చిన్నారుల గుండె చప్పుడు మా మహేష్ బాబు..
వేల చిన్నారుల గుండె చప్పుడు మా మహేష్ బాబు..
ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో ఐదు పతకాలు.. ఎవరెవరు ఏం సాధించారంటే
ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో ఐదు పతకాలు.. ఎవరెవరు ఏం సాధించారంటే
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీజీఎల్‌ టైర్-1 పరీక్ష తేదీలు విడుదల
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీజీఎల్‌ టైర్-1 పరీక్ష తేదీలు విడుదల
ఈ రోజున ఈ కథ తప్పక వినండి.. జీవితం ఆనందంతో నిండిపోతుంది
ఈ రోజున ఈ కథ తప్పక వినండి.. జీవితం ఆనందంతో నిండిపోతుంది
పారిస్ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ గెలిచాక నీరజ్ ఏమన్నారంటే.?
పారిస్ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ గెలిచాక నీరజ్ ఏమన్నారంటే.?
పీఎం కిసాన్ లబ్ధిదారులు ఫోన్ నంబర్ అప్ డేట్ చేసుకోవాలంటే ఎలా?
పీఎం కిసాన్ లబ్ధిదారులు ఫోన్ నంబర్ అప్ డేట్ చేసుకోవాలంటే ఎలా?
నేడే తెలంగాణ CPGET 2024 ఫలితాలు.. రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్
నేడే తెలంగాణ CPGET 2024 ఫలితాలు.. రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్
పశువుల పాకలో చిరుత డెలివరీ.. స్థానికుల రక్షణలో 3 పసికూనలు.!
పశువుల పాకలో చిరుత డెలివరీ.. స్థానికుల రక్షణలో 3 పసికూనలు.!
ఒకటోసారి.. రెండోసారి.. పోలీస్‌స్టేషన్‌లో పందెంకోళ్ల వేలం.
ఒకటోసారి.. రెండోసారి.. పోలీస్‌స్టేషన్‌లో పందెంకోళ్ల వేలం.
భారత్ పై చైనా వాటర్ బాంబ్.! ఎక్కడ ప్రయోగించారంటే..
భారత్ పై చైనా వాటర్ బాంబ్.! ఎక్కడ ప్రయోగించారంటే..
అది నిజం కావాలని ఆశిద్దాం.! పవన్ , రవితేజ పై డైరెక్టర్ కామెంట్స్.
అది నిజం కావాలని ఆశిద్దాం.! పవన్ , రవితేజ పై డైరెక్టర్ కామెంట్స్.
బరువెక్కిన హృదయంతో అభిమానులకు బహిరంగ లేఖ.!
బరువెక్కిన హృదయంతో అభిమానులకు బహిరంగ లేఖ.!
నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకుపోతున్న జక్కన్న డాక్యుమెంటరీ.! ట్రేండింగ్
నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకుపోతున్న జక్కన్న డాక్యుమెంటరీ.! ట్రేండింగ్
కాలి నడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అల్లు స్నేహ & పిల్లలు
కాలి నడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అల్లు స్నేహ & పిల్లలు
నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థంపై స్పందన. వీడియో వైరల్
నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థంపై స్పందన. వీడియో వైరల్
బిగ్ అప్డేట్.! ఇక డ్రాగన్ రాక లాంఛనమే.. షూటింగ్ మొదలు అప్పుడే.!
బిగ్ అప్డేట్.! ఇక డ్రాగన్ రాక లాంఛనమే.. షూటింగ్ మొదలు అప్పుడే.!
ఘోర అపచారం.. గర్భగుడిలో మూల విరాట్‌తో పాటు దర్శన్‌కు అభిషేకం.!
ఘోర అపచారం.. గర్భగుడిలో మూల విరాట్‌తో పాటు దర్శన్‌కు అభిషేకం.!