07 August 2024
Subhash
టెలికాం రంగంలో జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాల రీఛార్జ్ ధరలను పెంచడంతో వినియోగదారులకు మరింత భారం ఏర్పడుతోంది.
టెలికాం సంస్థ టారీఫ్ ధరలను పెంచడంతో వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. తమ నంబర్లను పోర్టు పెడుతున్నారు.
ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ మరింతగా పుంజుకుంటోంది. దేశ వ్యాప్తంగా 4జీ సేవలను ముమ్మరం చేస్తోంది. 5జీ నెట్‌వర్క్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో మరిన్ని నెలల్లో 4జీ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్రం టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా తెలిపారు.
మరిన్ని టావర్స్‌ను ఏర్పాటు చేసి 4జీ సేవలు అందుబాటులోకి వస్తే బీఎస్‌ఎన్‌ఎల్‌కు యూజర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
గత కొన్ని రోజులుగా BSNL కొత్త సిమ్ తీసుకునేవారి సంఖ్య పెరిగిందని మంత్రి తెలిపారు. ఈ క్రమంలో 4జీని 5జీకి అప్‌గ్రేడ్ చేసే పనులు జరుగుతున్నాయన్నారు.
ప్రభుత్వం చైనా, ఇతర పరికరాలను ఉపయోగించకుండా స్వదేశీ టెక్నాలజీతో 4జీని తీసుకువస్తున్నట్లు, అందుకే 4జీకి ఒకటిన్నర ఏళ్లు పట్టిందన్నారు.
మార్చి 2025 నాటికి లక్ష టవర్ల 4జీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.