హీరోలకే షాకిస్తున్న లేడీ సూపర్ స్టార్.. నయన్ ఆస్తులు ఎంతంటే
Rajitha Chanti
Pic credit - Instagram
గతేడాది జవాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది లేడీ సూపర్ స్టార్ నయనతార. మొదటి సినిమాతోనే హిందీలో సూపర్ హిట్ అందుకుంది.
ఈ మూవీ తర్వాత నయనతారకు మరిన్ని ఆఫర్స్ వచ్చినట్లు టాక్ నడిచింది. కానీ ఇప్పటివరకు ఈ బ్యూటీ మరో హిందీ సినిమాను అనౌన్స్ చేయలేదు.
కానీ ఇప్పటికీ హిందీలో నయన్ డిమాండ్ తగ్గడం లేదు. జవాన్ చిత్రానికి నయన్ రూ. 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందని ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్.
రెండు దశాబ్దాల కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించిన నయన్.. దాదాపు రూ.183 కోట్లు సంపాదించింది. హైదరాబాద్, చెన్నై, కేరళలో ఆస్తులు ఉన్నాయి.
కేరళలో నయనతార పూర్వీకుల ఇల్లు ఒకటి ఉన్నట్లు సమాచారం. అలాగే హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్ పరిసరాల్లో ఇళ్లు ఉన్నాయి.
కొన్ని సంవత్సరాల క్రితం నయనతార సొంతంగా ఒక ప్రైవేట్ జెట్‌ను కొనుగోలు చేసింది. ప్రస్తుతం చెన్నైలో రూ.100 కోట్లు విలువైన ఇంటిలో ఉంటుంది.
అలాగే నయన్ గ్యారెజీలో బిఎమ్‌డబ్ల్యూ 5 ఎస్, మెర్సిడెస్ జిఎల్‌ఎస్ 350 డి, ఫోర్డ్ ఎండీవర్, బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్, ఇన్నోవా క్రిస్టా వంటి కార్లు ఉన్నాయి.
భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి 2011లో రౌడీ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించింది నయన్. అలాగే 9 స్కిన్ బ్రాండ్ చర్మ సంరక్షణ ఉత్పత్తుల విక్రయిస్తుంది.