అలాంటి సమయాల్లో నేను కూడా చేతులెత్తేస్తా.! సమంత కామెంట్స్
Anil Kumar
08 August 2024
స్టార్ హీరోయిన్ సమంత ప్లానింగ్ ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు. తాను అనారోగ్యంగానే ఉన్నారా అంటే అదేం లేదు.!
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ అయ్యారు.. పైగా ఫోటోషూట్స్ తోనూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు.
హీరో విజయ్ దేవరకొండ తో కలిసి చేసిన ఖుషీ సినిమా తర్వాత మళ్లీ స్క్రీన్ మీద కనిపించలేదు ముద్దుగుమ్మ సమంత.
అయితే మొన్న ఆ మధ్య సామ్ పుట్టిన రోజు నాడు మా ఇంటి బంగారం అనే పేరుతో ఒక సినిమా అనౌన్స్ చేసింది ఈ బ్యూటీ.
కానీ దానికి సంబంధించి షూటింగ్ అప్‌డేట్ ఇప్పటికి ఏం లేదు. మరోవైపు ఈ మధ్యే మమ్ముట్టితో ఓ సినిమా సైన్ చేసారు.
అయితే తాజాగా మాట్లాడు.. క్లిష్ట సమయాల్లో కొన్నిసార్లు తాను కూడా చేతులెత్తేస్తానని అన్నారు అమ్మడు సమంత.
అయితే అంతటితో కథ ముగిసిపోయినట్టు కాదని చెప్పారు. తాను మళ్లీ తిరిగి పైకి లేస్తానని చెప్పుకొచ్చారు సామ్.
వర్క్ పట్ల అంకిత భావంతో ఉండే వరుణ్‌ధావన్‌తో కలిసి సిటాడెల్ హనీ బన్నీలో నటించినందుకు ఆనందంగా ఉందని అన్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి