
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంటోంది. భాషతో సంబంధం లేకుండా తెలుగు, హిందీ, తమిళ భాషలలో సినిమాలు చేస్తోందీ అందాల తార. ఇక ఉగాది కానుకగా ఇవాళ (మార్చి 19) శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇందులో హీరోగా నటించగా, రాశీ ఖన్నా మరో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇదిలా ఉంటే ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ప్రకటనల్లోనూ శ్రీలీల యాక్ట్ చేస్తోంది. అలాగే షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లోనూ పాల్గొంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తెలంగాణ లోని ఖమ్మం జిల్లాలోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున షాపింగ్ మాల్ దగ్గరకు వచ్చారు. శ్రీలీలతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. శ్రీ లీల కూడా తన కోసం వచ్చిన అభిమానులను నిరాశప్చకుండా అదరికీ హాయ్ చెబుతూ ఫొటోలు, సెల్ఫీలు దిగింది. అలాగే చాలా మందికి ఆటో గ్రాఫ్ కూడా ఇచ్చింది
ఈ క్రమంలో శ్రీలీల ఆటోగ్రాఫ్ తీసుకున్న అభిమాని ఒకరు ‘ రేయ్.. చెల్లెమ్మ ఆటోగ్రాఫ్ ఇచ్చింది’ అంటూ గట్టిగా అరిచాడు.ఇది విని అందరూ ఆశ్చర్యపోయారు. చివరకు శ్రీలీల కూడా అవాక్కైపోయింది. అభిమాని తనని చెల్లి అని పిలవడంతో స్పందించిన శ్రీలీల .. ‘వచ్చే రాఖీ పండుగకు నాకు గిఫ్ట్ ఇవ్వాలి’ అంటూ తనదైన శైలిలోనే హిలేరియస్ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. శ్రీలీలను చెల్లమ్మ అన్నాడంటే ఆ గుండె గట్టిదిరా అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే శ్రీలీల కూడా హిలేరియస్ గా స్పందించిందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.