Singer Mangli: మంగ్లీ క్రేజ్‌ మాములుగా లేదుగా.. కన్నడ ఫ్యాన్స్‌ ఏం చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

|

Oct 02, 2022 | 12:27 PM

కన్నడలో మంగ్లీకున్న పాపులారిటీకి సంబంధించి ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇందులోఆమెను ఓ యువరాణిలా పల్లకిలో మోసుకొచ్చారు కన్నడ ఫ్యాన్స్‌. దీనికి సంబంధించిన వీడియోను మంగ్లీనే సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

Singer Mangli: మంగ్లీ క్రేజ్‌ మాములుగా లేదుగా.. కన్నడ ఫ్యాన్స్‌ ఏం చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Singer Mangli
Follow us on

జానపదాలు, తెలుగు సినిమా పాటలు, స్పెషల్‌ సాంగ్స్‌.. ఇలా ఏవైనా తన తీయనైన గొంతుతో పాటకు ప్రాణం పోస్తుంది ప్రముఖ సింగర్‌ మంగ్లీ. అందుకే ఆమె పాటలకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ఇటీవల సుదీప్‌ విక్రాంత్‌ రోణ సినిమాలోని రక్కమ్మ పాటతో దక్షిణాదిన కూడా క్రేజ్‌ సంపాదించుకుంది. ఈనేపథ్యంలో కన్నడలో మంగ్లీకున్న పాపులారిటీకి సంబంధించి ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇందులోఆమెను ఓ యువరాణిలా పల్లకిలో మోసుకొచ్చారు కన్నడ ఫ్యాన్స్‌. దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది మంగ్లీ.. ‘ మీ అభిమానానికి సంతోషం. నాకు పట్టలేని ఆనందంగా ఉంది. కన్నడ బంధుగులు (కన్నడ బంధువులు) అందరికీ థ్యాంక్స్’ అంటూ మురిసిపోయింది.

కాగా విక్రాంత్‌ రోణ సినిమాలో మంగ్లీ పాడిన రక్కమ్మ పాట సూపర్‌డూపర్‌ హిట్ గా నిలిచింది. యూట్యూబ్‌లో ఈ పాటకు మిలియన్ల కొద్దీ వ్యూస్‌, లైకులు వచ్చాయి. కాగా పండగలు, ప్రత్యేక సందర్భాల్లో అద్భుతమైన పాటలతో ఆకట్టుకునే మంగ్లీ బతుకమ్మ ఉత్సవాల కోసం కూడా ప్రత్యేక పాటను రూపొందించింది. అయితే ఈ ఏడాది ఉత్సవాల్లో ఆమె పాడిన ఓ పాట కాంట్రవర్సీగా మారింది. ‘చెట్టుకింద కూసున్నవమ్మా’ అంటూ సాగే ఈ పాటలో అమ్మవారిపై వాడిన పదాలు వివాదానికి దారి తీశాయి. మంగ్లీ క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి. అయితే ఎవరో రాసిన పాటకు ఆమె ఎలా క్షమాపణ చెబుతుందంటూ చాలామంది మంగ్లీకి మద్దతుగా నిలిచారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..