అందాల భామ శ్రుతిహాసన్ ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా ఉంటుంది. రీసెంట్ గా ఆమె చేసిన కామెట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ గా సింగర్ గా తన ప్రతిభ చాటుకుంటున్న శ్రుతి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. రీసెంట్ గా రెండు సూపర్ హిట్స్ తో ఫుల్ జోష్ మీద ఉంది ఈ చిన్నది. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా, అలాగే బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. వీరసింహారెడ్డి సినిమాలో గ్లామరస్ పాత్రలో నటించి ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే మరోసారి శ్రుతిహాసన్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. మంచుకొండల్లో సాంగ్స్ షూటింగ్ గురించి శ్రుతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
మంచు ప్రాంతంలో షూటింగ్ చేసే సమయంలో విపరీతమైన చలి ఉంటింది. మంచులో డ్యాన్స్ చేసే సమయంలో హీరోలు చలిని ఆపే జాకెట్ వేసుకుంటారు. కానీ హీరోయిన్లకు మాత్రం జాకెట్ కానీ కోట్ కానీ శాలువా కానీ ఇవ్వరని శృతి హాసన్ చెప్పుకొచ్చింది.
చీరలో, లేదా నార్మల్ డ్రస్ లో డాన్స్ వేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో చాలా ఇబ్బంది పడుతుంటాం.. హీరోయిన్ల విషయంలో ఇలాంటివి ఆపాలని శృతి హాసన్ చెప్పుకొచ్చింది. హీరోయిన్స్ కు కూడా జాకెట్స్ ఇవ్వాలని ఆమె అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెటిజన్స్ ఈ కామెంట్స్ పై రకరకాలుగా స్పందిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి