
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాజా సాబ్ ప్రేక్షకులను ముఖ్యంగా ప్రభాస్ అభిమానులను నిరాశపరిచింది. దాంతో ఈసారి రెబల్ స్టార్ కు సాలిడ్ హిట్ కొట్టాలని ఆయన ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు స్పిరిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే వరుసగా సినిమాలను లైనప్ చేసిన ప్రభాస్ ఆయా షూటింగ్స్ లో యమా బిజీగా ఉన్నాడు. వాటిలో ముందుగా వచ్చేది మాత్రం స్పిరిట్ సినిమానే.. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఆడియన్స్ లో ఆసక్తి రెట్టింపైంది. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాను నెక్ట్స్ లెవల్ లో తెరకెక్కిస్తున్నారు.
స్పిరిట్ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్ ఆడియన్స్ మైండ్ బ్లాక్ చేసింది. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి.. ఇప్పుడు ప్రభాస్ ను స్పిరిట్ లో ఎలా చూపించబోతున్నడో అంటూ ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని ఇప్పటికే హింట్ ఇచ్చాడు సందీప్.. స్పిరిట్ పోస్టర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది.
ఇక ఈ మూవీలో త్రిప్తి డిమ్రీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే స్పిరిట్ సినిమా నుంచి ఓ స్టార్ నటుడు తప్పుకుంటున్నాడని టాక్ వినిపిస్తుంది. ఆయన ఎవరో కాదు ప్రకాష్ రాజ్. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ రాజ్ కీలక పాత్రలో ఎంపిక చేశారట. అయితేఈ సినిమా నుంచి ప్రకాష్ రాజ్ తప్పుకున్నాడని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. ఓ సీన్ విషయంలో ఇద్దరి మధ్య డిఫరెన్స్ రావడంతో ప్రకాష్ రాజ్ సినిమా నుంచి తప్పుకున్నారని అంటున్నారు. గతకొద్ది రోజులుగా ఇదే వార్త చక్కర్లు కొడుతున్నా పెద్దగా అప్డేట్ అయితే రాలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ సినిమాలో ప్రకాష్ రాజ్ లేరు అని క్లారిటీ ఇచ్చారు. సందీప్ రెడ్డి, ప్రకాష్ రాజ్ ఇద్దరూ ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తులు.. దాంతో ఇద్దరి మధ్య చిన్న ఇష్యు వచ్చిందని అంటున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.