AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: ‘అది చాలా కష్టమైన సమయం.. ఇష్టమైనా వదిలేసుకున్నాను’.. కెరీర్ పై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

కొన్నాళ్ల క్రితం మయోసైటిస్ సమస్యకు ఇంట్లోనే చికిత్స తీసుకున్న సామ్.. ఆ తర్వాత ఖుషి, సిటాడెల్ చిత్రీకరణలు కంప్లీట్ చేసింది. ప్రస్తుతం ఆమె భూటాన్‏లో ఇమ్యూనిటీ చికిత్స తీసుకుంటుంది. అక్కడి నుంచి అందమైన లోకేషన్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఇదిలా ఉంటే.. సామ్.. ఇటీవల హార్పర్స్ బజార్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమా విషయాలే కాకుండా.. వ్యక్తిగత విషయాలు..మోడలింగ్ రోజుల నుంచి టాప్ హీరోయిన్ గా ఎదగడానికి ఆమె ఎదుర్కొన్న పోరాటాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.

Samantha: 'అది చాలా కష్టమైన సమయం.. ఇష్టమైనా వదిలేసుకున్నాను'.. కెరీర్ పై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Samantha
Rajitha Chanti
|

Updated on: Nov 10, 2023 | 6:40 AM

Share

సమంత.. అతి తక్కువ సమయంలో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‎గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో ఒకరు. తెలుగులో దాదాపు అందరూ అగ్రహీరోలకు జోడిగా నటించి అలరించింది సామ్. కానీ గత రెండేళ్ల క్రితం ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రేమ, పెళ్లి విఫలం కావడం.. మరోవైపు ఆరోగ్య సమస్యలు వేధిస్తుండడం, మానసిక సంఘర్షణతో నిత్యం పోరాటం చేస్తుంది. కొన్నాళ్ల క్రితం మయోసైటిస్ సమస్యకు ఇంట్లోనే చికిత్స తీసుకున్న సామ్.. ఆ తర్వాత ఖుషి, సిటాడెల్ చిత్రీకరణలు కంప్లీట్ చేసింది. ప్రస్తుతం ఆమె భూటాన్‏లో ఇమ్యూనిటీ చికిత్స తీసుకుంటుంది. అక్కడి నుంచి అందమైన లోకేషన్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఇదిలా ఉంటే.. సామ్.. ఇటీవల హార్పర్స్ బజార్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమా విషయాలే కాకుండా.. వ్యక్తిగత విషయాలు..మోడలింగ్ రోజుల నుంచి టాప్ హీరోయిన్ గా ఎదగడానికి ఆమె ఎదుర్కొన్న పోరాటాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. జీవితంలో కష్ట సమయాలను గడుపుతున్న రోజుల్లో మోడలింగ్ తనకు మంచి లైఫ్ ఇచ్చిందని.. కానీ అందుకు ఎంతో ఇష్టపడే చదువు వదిలేయాల్సి వచ్చిందని తెలిపింది సమంత.

హార్పర్స్ బజార్: దీపికా పదుకొణె లాగా, మీరు కూడా మీ కెరీర్ తొలిదశలో మోడలింగ్‌లో అడుగుపెట్టారు. మీరు నటి కావాలని ఎప్పటి నుంచి అనుకున్నారు ?.. అలాగే మోడలింగ్ నుంచి మీరు నేర్చుకున్నారు ? అని అడగ్గా సామ్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి

సమంత మాట్లాడుతూ.. “నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే కొంతకాలం మోడలింగ్ చేశాను. కానీ అప్పుడు ఎక్కువగా చదువుపై దృష్టి పెట్టాను. చదువు విజయానికి మార్గం అని తల్లిదండ్రులు చెప్పేవారు. అందుకే బాగా చదువుకోవాలని అనుకున్నాను. నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. రోజూ ఉదయం 4:00 గంటలకు లేచి చదువుకున్నాను. పరీక్ష రోజున వందోసారి చదువుతూనే ఉన్నాను. కానీ చదువును అంత పట్టుదలగా కాకుండా తేలికగా తీసుకుంటే ఓకే అని అమ్మ చెప్పేది. అలాగే నటన కూడా నా ఎంపిక కాదు అని అనుకోను. కష్టమైన సమయాల్లో నాకు మోడలింగ్ ఒక ప్రయోజనాన్ని ఇచ్చిందని నేను భావిస్తున్నాను. ఇంట్లో విషయాలు అంత తేలికగా లేవు. దీంతో నేను పై చదువులు చదువుకోలేకపోయాను. ఆ సమయంలోనే నా జీవితంలో ఎటువంటి ప్రణాళిక లేకుండా సమయంలో ఉన్నాను.

అప్పుడే మోడలింగ్ నాకు ఒక ప్రణాళిక , లక్ష్యాన్ని ఇచ్చింది. కెమెరా ముందు ఉండడం అదృష్టం. నేను ఇప్పుడు నా మోడలింగ్ ప్రారంభించినప్పుడు సరిగ్గా కనిపించలేదు. అందుకే అప్పుడు టీవీలో నేను కనిపిస్తే చాలా ఇబ్బంది పడ్డాను. టీవీలో కనిపిస్తే భయంతో పరిగెత్తాను” అంటూ తన మోడలింగ్ రోజులను గుర్తుచేసుకుంది సామ్. ప్రస్తుతం ఆమె నటించిన సిటాడెల్ చిత్రం త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us