ఇదెక్కడి అరాచకం సామీ..! అతనితో రొమాంటిక్ సాంగ్‌కు సమంత స్టెప్పులు.. షాక్‌లో నెటిజన్స్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్యన సినిమాల కంటే ఇతర విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా డేటింగ్, రిలేషన్ షిప్ విషయాల్లో సామ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె డేటింగ్‌లో ఉందని ప్రచారం జరుగుతోంది.

స్టార్ హీరోయిన్ సమంత ఇటీవలే నిర్మాతగా మారింది. రీసెంట్ గానే శుభం అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తెలుగు ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఏలింది సమంత.. ఏ స్టార్ హీరో సినిమా చూసినా హీరోయిన్ గా సమంతానే ఉండేది. అయితే గతకొంతకాలంగా సమంత సినిమాలు చేయడం లేదు. మొన్నటివరకు మాయోసైటిస్ తో బాధపడిన సమంత ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. అలాగే ఏడాదిపాటు సమంత సినిమాలకు బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే.. ఇప్పుడు తిరిగి సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇదిలా ఉంటే ఈ మధ్య సమంత మరోసారి రిలేషన్ లో ఉంది అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. త్వరలో సమంత పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి : బెడిసికొట్టిన సర్జరీ.. గుర్తుపట్టలేనంతగా మారిన నటి.. తిట్టిపోస్తున్న నెటిజన్స్
ఈ మధ్యకాలంలో సమంత ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. ఇప్పుడు సమంత కూడా రెండో పెళ్లి చేసుకోబోతుందని టాక్ వినిపిస్తుంది. కాగా దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ చేస్తుందని కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో రాజ్ నిడిమోరు పాపులర్ అయ్యారు. ఈ మధ్యకాలంలో సమంత, రాజ్ నిడిమోరు కలిసున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దాంతో ఈ ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి.
ఇది కూడా చదవండి : ఎలాంటి అమ్మాయి ఎలా మార్చేశారా..! నటనతో పిచ్చెక్కించిన ఈ భామ ఎవరో తెలుసా..?
ఇదిలా ఉంటే సమంతకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సమంత ఈ వీడియోలో ఓ వ్యక్తితో డాన్స్ చేస్తూ కనిపించింది. ఇంతకూ అతను ఎవరో కాదు టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిషోర్. సమంత వెన్నెల కిషోర్ మంచి స్నేహితులు. ఈ విషయం చాలా మందికి తెలుసు. అలాగే సింగర్ చిన్మయి భర్త రాహుల్ కూడా సమంతకు మంచి ఫ్రెండ్. రాహుల్ ప్రస్తుతం రష్మిక మందనతో కలిసి గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇటీవల ఓ సాంగ్ విడుదలైంది. ఆ సాంగ్ లోని ఓ హుక్ స్టెప్ ను వెన్నెల కిషోర్ తో కలిసి చేసింది సామ్. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. భలే క్యూట్ గా చేశారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి :18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తల్లైంది.. రెండు సార్లు విడాకులు.. చివరకు ఇప్పుడు ఇలా
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








