మలయాళీ చిత్రపరిశ్రమలో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించాడు. కేవలం హీరోయిజం సినిమాలు కాకుండా వైవిధ్యమైన పాత్రలు.. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కేవలం మలయాళంలోనే కాకుండా తమిళం, తెలుగు, హిందీ భాషలలోనూ ఈ హీరోకు అభిమానులు ఉన్నారు. ఇప్పటివరకు పృథ్వీరాజ్ నటించిన చిత్రాలు తెలుగులోకి డబ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇటీవలే నేరుగా తెలుగు చిత్రంలోనూ నటించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన సలార్ మూవీలో పృథ్వీరాజ్ కీలకపాత్ర పోషించాడు. ఇందులో డార్లింగ్ స్నేహితుడిగా అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకున్నాడు. అలాగే ఇటీవలే ఆడు జీవితం సినిమాతో మరో విజయాన్ని అందుకున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ఓ న్యూస్ నెట్టింట వైరలవుతుంది.
తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం పృథ్వీరాజ్ సుకుమారన్ ముంబైలో ఓ కొత్త ఇంటిని కొనుగోలు చేశారట. ముంబైలో అతడికి ఇది రెండో ఇల్లు. కానీ ఇప్పుడు కొన్న విలాసవంతమైన ఇంటి ధర ఏకంగా రూ.30 కోట్లు ఉంటుందని సమాచారం. అంతేకాదు ఆ ఇల్లు పాలి హిల్ లో ఉందట. అంటే ఆ ఏరియాను బాలీవుడ్ ఎ-లిస్టర్‌ల హాంట్‌గా పిలుస్తారు. చాలా మంది బాలీవుడ్ స్టార్స్ ఇక్కడ నివసిస్తున్నారు. అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, రణవీర్ సింగ్, తేగర్ ష్రాఫ్, క్రికెటర్ కె. ఎల్. రాహుల్ తదితరులందరికీ ఇక్కడ నివాసాలు ఉన్నాయి. పృథ్వీరాజ్ అతడి భార్య సుప్రియకు చెందిన నిర్మాణ సంస్థ అయిన పృథ్వీరాజ్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ఈ ఇంటిని కొనుగోలు చేశారు. బాంద్రా వెస్ట్‌లోని ప్రీమియం హౌసింగ్ సొసైటీ అయిన నరైన్ టెర్రస్‌లో 2971 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కొత్త ఇల్లు ఉంది. అక్కడ 431 చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది. ఈనెలలోనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. రియల్ ఎస్టేట్ ఏజెన్సీ స్క్వేర్ యార్డ్స్ స్టార్ నివాసాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. స్టాంప్ డ్యూటీ కోసం నటుడు రూ. 1.84 కోట్లు, రిజిస్ట్రేషన్ ఫీజు కోసం రూ. 30,000 ఖర్చు చేసినట్లు సమాచారం.
ఈ ఇంటి కంటే ముందు అతడికి ముంబైలో మరో ఇల్లు కూడా ఉంది. రూ.17 కోట్ల విలువైన విలాసవంతమైన అపార్ట్‌మెంట్ అది. స్టార్ ఫ్లాట్ భవనంలోని పదహారవ అంతస్తులో ఉంది. ఇది 2109 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంది. ఇక్కడ మూడు కార్ పార్కింగ్ స్లాట్లు ఉన్నాయి. ప్రస్తుతం పృథ్వీరాజ్ తన కుటుంబంతో కేరళలోని కొచ్చిలో నివసిస్తున్నాడు. తల్లి మల్లికా సుకుమారన్ ఇల్లు కూడా ఇక్కడే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.