
‘ రామాయణం ‘ సినిమా అద్భుతంగా ఆడుతోంది. దీపావళి కానుకగా నవంబర్ 05న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కేవలం ఎనిమిది రోజుల్లోనే 1000 కోట్ల మార్కును దాటింది. ట్రెండ్ చూస్తుంటే ఈ సినిమా ఖచ్చితంగా 2000 కోట్ల మార్కును దాటుతుందని అంటున్నారు. రాముడిగా రణ్ బీర్ , సీతమ్మ పాత్రలో సాయి పల్లవిల నటన, విజువల్ ఎఫెక్ట్స్, అన్నిటికీ మించి రావణాసురుడి పాత్రలో యశ్ నటన రామాయణ సినిమాను బ్లాక్ బస్టర్ గా నిలిపాయి. అయితే సీతమ్మ పాత్రలో సాయ పల్లవి నటనకు కూడా విమర్శకుల ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన సాయి పల్లవి సీతమ్మ పాత్రను ఎంతో అంకితభావంతో చేశానని చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో షూటింగ్ సమయంలో తాను కన్నీళ్లు పెట్టుకున్న ఒక సంఘటనను కూడా ఆమె గుర్తుచేసుకుంది. ‘ రామాయణం సినిమా సెట్ లో నా డైలాగ్ కోచ్ చేసిన పనికి నేను ఆశ్చర్యపోయాను. ఆమె వచ్చి తన పాదాలకు నమస్కరించడాన్ని ఊహించలేకపోయాను. ఆమెకు నేను సాయిపల్లవినని తెలుసు. కానీ ఆమె ప్రతిరోజూ పూజించే ఓ పాత్రలో నన్ను చూసినప్పుడు బాగా ఎమోషనల్ అయింది. ఎదుట ఉన్నది ఆ పాత్రలో నటించిన నేను అని ఆమె అనుకోలేదు. ఆ పాత్రపై ప్రేమను మాత్రమే చూపించాలనుకుంది’ అని సాయిపల్లవి తెలిపారు. ఆ ఘటన తర్వాత తనకు కన్నీళ్లు ఆగలేదని సాయిపల్లవి పేర్కొంది. ‘‘మీరు అసలు ఏం చేస్తున్నారు?’ అని అడిగాను. ఆ క్షణమే ఆ పాత్ర ఎంతోమంది మనసులకు హత్తుకుంటుందని నాకు అర్థమైంది. ఇంతటి ప్రేమను పొందడం నా అదృష్టం’ అని సాయిపల్లవి ఎమోషనల్ అయ్యింది.
రవి దూబే, రణబీర్ కపూర్లతో కలిసి ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, సాయి పల్లవి సీతామాత పాత్ర పోషించడం గురించి మాట్లాడింది. ‘నేను ఏ పాత్ర చేసినా, ఆ పాత్రకు నేను ఏమి ఇవ్వగలనో ఆలోచిస్తాను. కానీ సీతామాత వంటి పాత్ర పోషించడం ద్వారా నేను ఏమి పొందగలను? దీని నుండి నాకు ఎలాంటి జ్ఞానం లభిస్తుంది? అని ఆలోచించాను.ఈ సినిమా చేసే టప్పుడు చాలా అంకిత భావంతో, పారదర్శకంగా ఉండాలనుకున్నాను. నేను సీతామాతకు ప్రార్థన చేసి ముందుకు సాగాను’ అని సాయి పల్లవి పేర్కొంది. నితేష్ తివారీ తెరకెక్కించిన రామాయణ సినిమాలో చాలా మంది స్టార్స్ నటించారు. సన్నీ డియోల్, శోభన, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, హరీశ్ ఉత్తమన్, ఫైసల్ మాలిక్, వివేక్ ఒబెరాయ్, కునాల్ కపూర్, ముకేశ్ తివారి, అనుపమ్ ఖేర్, సౌరబ్ సచ్దేవ్, రవి దూబే, ఆదినాథ్ కొఠారే, నితీశ్ శర్మ తదితరులు ఈ మూవీలో వివిధ పాత్రలు పోషించారు. నమిత్ మల్హోత్రాకు చెందిన ‘ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్’, యష్‌కు చెందిన ‘మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్’, ‘డీఎన్ఈజీ’ సంస్థలు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించాయి. హన్స్ జిమ్మర్, ఏ ఆర్ రెహమాన్ సంయుక్తంగా ఈ సినిమాకు స్వరాలను సమకూర్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.