
మెగా మేనల్లుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు సాయి దుర్గతేజ్. తనదైన యాక్టింగ్, స్టైల్, డ్యాన్స్ లతో సుప్రీం హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మధ్యలో రోడ్డు ప్రమాదం కారణంగా కెరీర్ లో కొంచెం వెనకపడినా రీఎంట్రీలో విరూపాక్ష సినిమాతో ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరాడీ ట్యాలెంటెడ్ హీరో. అలాగే పవన్ కల్యాణ్ తో కలిసి నటించిన బ్రో సినిమాతోనూ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. సినిమాల సంగతి పక్కన పెడితే.. తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో సాయి ఒకరని చెప్పవచ్చు. చాలా సార్లు ఆయన పెళ్లి గురించి వార్తలు వచ్చినా అవన్నీ రూమర్లు గానే మిగిలిపోయాయి. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఈ మెగా మేనల్లుడు ఒక ఇంటివాడు కాబోతున్నాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ సుప్రీం హీరో కూడా పెళ్లిపీటలెక్కనున్నట్లు టాక్. తన చిన్ననాటి స్నేహితురాలిని సాయి దుర్గతేజ్ వివాహం చేసుకోబోతున్నట్లు టాక్ .నవంబర్ 5వ తేదీన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య ఘనంగా నిశ్చితార్థం జరుపుకోబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇరు కుటుంబాల మధ్య చర్చలు కూడా ముగిసాయని, నిశ్చితార్థమైన రెండు నెలలోపే వివాహం కూడా జరిపించాలని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే సాయి దుర్గతేజ్ ఎంగేజ్మెంట్, పెళ్లి వార్తలపై అటు హీరో ఫ్యామిలీ కానీ, మెగా కుటుంబ సభ్యులు కానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. కానీ ఈ మెగా మేనల్లుడి పెళ్లి వార్తలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారాయి. బ్యాచిలర్ లైఫ్ ను వీడి వైవాహిక బంధం లోకి అడుగుపెట్టబోతున్నట్లు వార్తలు వస్తుండడంతో మెగాభిమానులు తెగ సంబరపడిపతున్నారు. సాయి పెళ్లిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వాలని కూడా మెగాభిమానులు కోరుతున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సంబరాల ఏటి గట్టు అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు సాయి దుర్గతేజ్. డైరెక్టర్ రోహిత్ కేపీ తెరకెక్కిస్తోన్న ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ లో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ప్రముఖ కన్నడ నటుడు ధనుంజయ కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరితో పాటు జగపతిబాబు, నరేష్ బి కృష్ణ, సాయికుమార్, శ్రీకాంత్ , అనన్య నాగళ్ళ తదితరులు వివిధ పాత్రలు పోషిస్తున్నారు. హనుమాన్ మూవీ ని నిర్మించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కే నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మెగా మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి