మొదటిసారి ఎమోషనల్ అయిన ఆర్జీవీ..’నిర్భయ’ దోషుల లాయర్‌పై నిప్పులు..

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన చేశారు.  దిశ ఘటనపై సినిమాను తెరకెక్కించబోతున్నట్టు ట్విట్టర్‌లో ప్రకటించారు. దీనిపై వరస ట్వీట్లు చేసిన ఆర్జీవీ..సినిమా థీమ్‌ని కూడా వివరించారు. ‘‘నా తర్వాతి సినిమా ‘దిశ’. దిశ రేప్ అండ్ మర్డర్ ఉదంతం గురించి ఈ సినిమా ఉండబోతోంది. ‘నిర్భయ’ ఘటన తర్వాత అంతకంటే దారుణంగా, ఊహించని విధంగా  ఓ ఆడపిల్లను నలుగురు రేప్ చేసి సజీవదహనం చేశారు. అప్పటి రేపిస్ట్‌ల నుంచి.. నేటి తరం రేపిస్టులు […]

మొదటిసారి ఎమోషనల్ అయిన ఆర్జీవీ..'నిర్భయ' దోషుల లాయర్‌పై నిప్పులు..

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన చేశారు.  దిశ ఘటనపై సినిమాను తెరకెక్కించబోతున్నట్టు ట్విట్టర్‌లో ప్రకటించారు. దీనిపై వరస ట్వీట్లు చేసిన ఆర్జీవీ..సినిమా థీమ్‌ని కూడా వివరించారు.

‘‘నా తర్వాతి సినిమా ‘దిశ’. దిశ రేప్ అండ్ మర్డర్ ఉదంతం గురించి ఈ సినిమా ఉండబోతోంది. ‘నిర్భయ’ ఘటన తర్వాత అంతకంటే దారుణంగా, ఊహించని విధంగా  ఓ ఆడపిల్లను నలుగురు రేప్ చేసి సజీవదహనం చేశారు. అప్పటి రేపిస్ట్‌ల నుంచి.. నేటి తరం రేపిస్టులు ఏం నేర్చుకుంటున్నానారో ఈ సినిమాలో గుణపాఠంగా చూపించబోతున్నా. నిర్భయను రేప్ చేసి..రోడ్డు మీద వదిలేసి వెళ్తే..పోలీసులకు దొరికిపోయారు. కానీ దిశను ఆధారాలు దొరకకూడదని సజీవదహనం చేశారు” అని వర్మ ట్వీట్లు చేశారు.

మరోవైపు నిర్భయ నిందుతుల తరుఫున వాదనలు వినిపిస్తోన్న లాయర్ ఏపీ సింగ్‌పై వర్మ తన మార్క్ కామెంట్స్ చేశారు. ‘లా’ లో ఉన్న లూప్‌హోల్స్  అడ్డుపెట్టుకుని లాయర్ ఏపీ సింగ్ లాంటి వాళ్లు ఆడుకుంటున్నారని.. వాళ్లని ఆడుకునేలా తన మూవీ ఉంటుందని చెప్పాడు. ఒక్కసారి నిర్భయ తల్లి పడే బాధ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవాలంటూ ఎమోషనల్‌గా మాట్లాడాడు వర్మ. ఆర్జీవీ ఈ తరహా ట్వీట్లు చెయ్యడం ఇదే మొదటి సారి.

Published On - 2:53 pm, Sat, 1 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu