Renu Desai: తన పెళ్లి , పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్..

టైగర్ నాగేశ్వరరావు’మూవీలో స్టూవర్ట్‌పురం దొంగలను మార్చే సామాజిక కార్యకర్త హేమాలత లవణం పాత్రలో రేణు నటనకు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. అయితే టీవీ 9 ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో రేణు పెళ్లి విషయం మాట్లాడుతూ.. తన మళ్ళీ పెళ్లి విషయం గురించి మనసులో మాట పంచుకుంది.

Renu Desai: తన పెళ్లి , పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్..
Actress Renu Desai

Updated on: Oct 23, 2023 | 9:18 PM

రేణు దేశాయ్ మల్టీటాలెంట్ పర్సన్..  మోడల్ గా కెరీర్ ను మొదలు పెట్టిన రేణు దేశాయ్.. తమిళ సినిమాతో నటిగా వెండి తెరపై అడుగు పెట్టింది.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బద్రి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది. మంచి నటి మాత్రమే కాదు మంచి డిజైనర్ కూడా.. ప్రేమ పెళ్లి విడాకులు అన్నిటిని దేవుడి నిర్ణయంగా తీసుకుని జీవితాన్ని తన ఇద్దరు పిల్లలు అకిరా, ఆద్య తో కలిసి హ్యాపీ గా గడుపుతున్న రేణు .. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వెండి తెరపై రీ ఎంట్రీ ఇచ్చింది. రవి తేజ నటించిన టైగర్ నాగేశ్వర రావు సినిమా లో కీలక పాత్రలో కనిపించి అలరించింది. టైగర్ నాగేశ్వరరావు’మూవీలో స్టూవర్ట్‌పురం దొంగలను మార్చే సామాజిక కార్యకర్త హేమాలత లవణం పాత్రలో రేణు నటనకు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. అయితే టీవీ 9 ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో రేణు పెళ్లి విషయం మాట్లాడుతూ.. తన మళ్ళీ పెళ్లి విషయం గురించి మనసులో మాట పంచుకుంది. చేసుకోవాలని ఉందని తప్పని సరిగా పెళ్లి చేసుకుంటానని.. అయితే తనకు రెండు మూడేళ్లు పడుతుందని.. అప్పుడు పెళ్లి చేసుకుంటానని.. అప్పుడు అందరికి చెప్పి పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది రేణు దేశాయ్.

అంతేకాదు రాజకీయాల గురించి ఆసక్తి ఉందా అని అంటే.. పాలిటిక్స్ పదమే ఒక నెగిటివ్ పదం అయింది మన సమాజం లో .. మా పిల్లలు డాక్టర్ కావాలి.. ఇంజనీర్ కావాలి అని అంటారు కానీ ఏ తల్లిదండ్రులు తమ పిల్లలు మంచి రాజకీయ నేత కావాలని కోరుకోరు.. అంతగా రాజకీయాలు అంటే అభిప్రాయం ఉంది.. కానీ తనకు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని లేదు.. కానీ తాను సోషల్ సర్వీస్ చేస్తానని తనకు అలా సాయం చేయడం ఇష్టమని పేర్కొంది రేణు దేశాయ్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us