Reginaa Cassandrra: శేఖర్ కమ్ముల మూవీ రిజెక్ట్ చేసిన రెజీనా.. ఆ సినిమా చూసుంటే కథ మరోలా ఉండేది..

|

Sep 10, 2024 | 3:18 PM

తాజాగా రెజీనా నటించిన ఉత్సవం సినిమా సెప్టెంబర్ 13న అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటుంది. తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తిర విషయాలను పంచుకుంది రెజీనా. తెలుగులో తనకు ఓకేసారి రెండు ఆఫర్స్ రావడంతో డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలిపింది.

Reginaa Cassandrra: శేఖర్ కమ్ముల మూవీ రిజెక్ట్ చేసిన రెజీనా.. ఆ సినిమా చూసుంటే కథ మరోలా ఉండేది..
Regina, Sekhar Kammula
Follow us on

టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే చాలా ఫేమస్ అయిన హీరోయిన్ రెజీనా కసాండ్రా. శివ మనసులో శ్రుతి (SMS) సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఈ బ్యూటీ.. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ వచ్చినప్పటికీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు. తెలుగులో అనేక చిత్రాల్లో నటించిన రెజీనా.. కొన్నాళ్లుగా తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు. ప్రస్తుతం తమిళం, హిందీ సినిమాల్లో నటిస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా రెజీనా నటించిన ఉత్సవం సినిమా సెప్టెంబర్ 13న అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటుంది. తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తిర విషయాలను పంచుకుంది రెజీనా. తెలుగులో తనకు ఓకేసారి రెండు ఆఫర్స్ రావడంతో డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలిపింది.

“నేను కాలేజీ చదివేటప్పటి నుంచే సినిమాలు చేశాను. కన్నడ, తమిళంలో రెండు సినిమాలు చేసిన తర్వాతా తెలుగులో ఆడిషన్స్ ఇచ్చాను. కానీ తెలుగులో ఒకేసారి రెండు సినిమాలకు సెలక్ట్ అయ్యాను. శివ మనసులో శృతి, శేఖర్ కమ్ముల గారి లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీస్ కోసం సెలక్ట్ అయ్యాను. రెండు సినిమాలకు ఆడిషన్స్ పూర్తైన తర్వాత రెండు ప్రాజెక్ట్స్ కోసం ఎంపిక చేశారు. అయితే ఓకేసారి రెండు సినిమాలకు కుదరదు.. కేవలం ఒక్క సినిమాకే డేట్స్ ఇవ్వాలి. కెరీర్ మొదట్లోనే రెండు సినిమాలకు ఛాయిస్ రావడం గొప్ప విషయం” అంటూ చెప్పుకొచ్చింది.

దీంతో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీ ఆఫర్ వదులుకుని శివ మనసులో శ్రుతి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో అందరూ కొత్త నటీనటులే కనిపించారు. చాలా కాలం బ్రేక్ తీసుకున్న రెజీనా.. ఇప్పుడు ఉత్సవం సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.