Eagle Box Office Collections: ‘ఈగల్’ బాక్సాఫీస్ ఫస్ట్ డే కలెక్షన్స్.. రవితేజ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా ఎంత వసూలు చేసిందంటే..

రవితేజ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. టైగర్ నాగేశ్వరరావు తర్వాత మాస్ మాహారాజా నటించిన మూవీ కావడంతో ఈగల్ పై అంచనాలు పంచేశాయి. అలాగే ఇందులో రవితేజ సరికొత్త పాత్రలో కనిపించనుండడంతో మరింత క్యూరియాసిటీ ఏర్పడింది. కానీ మొత్తానికి నిన్న విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. ఇప్పటి దాక పాజిటివ్ రివ్యూస్ అందుకున్న ఈ మూవీ ఫస్ట్ డే ఎంతవరకు వసూళు చేసిందో తెలుసుకోవాల్సిందే.

Eagle Box Office Collections: 'ఈగల్' బాక్సాఫీస్ ఫస్ట్ డే కలెక్షన్స్.. రవితేజ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా ఎంత వసూలు చేసిందంటే..
Eagle Movie OTT
Follow us

|

Updated on: Feb 10, 2024 | 10:52 AM

మాస్ మాహారాజా రవితేజ నటించిన సినిమా ‘ఈగల్’ ఈ శుక్రవారం అడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 9న గ్రాండ్ గా విడుదలైన ఈ మూవీ ఉదయం నుంచి సూపర్ హిట్ రెస్పాన్స్ అందుకుంది. ఈ మాస్ యాక్షన్ కమర్షియల్ చిత్రాన్ని డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన విధానంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో రవితేజను చూపించిన విధానం.. ఆయన పాత్రకు ఇచ్చిన ఎలివేషన్స్ మైండ్ బ్లాంక్ అంటూ అడియన్స్ రివ్యూ కూడా ఇచ్చేశారు. దీంతో రవితేజ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. టైగర్ నాగేశ్వరరావు తర్వాత మాస్ మాహారాజా నటించిన మూవీ కావడంతో ఈగల్ పై అంచనాలు పంచేశాయి. అలాగే ఇందులో రవితేజ సరికొత్త పాత్రలో కనిపించనుండడంతో మరింత క్యూరియాసిటీ ఏర్పడింది. కానీ మొత్తానికి నిన్న విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. ఇప్పటి దాక పాజిటివ్ రివ్యూస్ అందుకున్న ఈ మూవీ ఫస్ట్ డే ఎంతవరకు వసూళు చేసిందో తెలుసుకోవాల్సిందే.

విడుదలైన మొదటి రోజే ఈగల్ సినిమా దేశవ్యాప్తంగా మొత్తం రూ.6 కోట్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం మొత్తం 37.48 శాతం ఆక్యుపెన్సీని కలిగి ఉంది. అలాగే హిందీలో ఆక్యుపెన్సీ 7.46 శాతం నమోదు అయ్యింది. ఇక ఈ వీకెండ్ శని, ఆదివారం రెండు రోజుల్లో ఈగల్ కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మాస్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో ఫైట్స్, క్లైమాక్స్ బాగున్నయని టాక్ వినిపించింది. గతంలో సూర్య వర్సెస్ సూర్య సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్ కార్తీక్.. ఇప్పుడు మరోసారి ఈగల్ సినిమాతో సక్సెస్ అయ్యాడు. ఇందులో రవితేజ పాత్రను చూపించిన తీరు ప్రేక్షకులను తెగ నచ్చేసింది. అలాగే అధిక స్టేక్స్ యాక్షన్ సన్నివేశాలు కట్టిపడేశాయి.

ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించగా.. అజయ్ ఘోష్, శ్రీనివాస్ అవసరాల, నవదీప్, మధుబాల, ప్రణీత పట్నాయక్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి దావ్ జాంద్ అందించిన సంగీతం హైలెట్ అయ్యింది. నిజానికి ఈ మూవీ సంక్రాంతి పండక్కి జనవరి 12న విడుదల కావాల్సింది. కానీ ఆ సమయంలో వరుసగా నాలుగు పెద్ద చిత్రాలు విడుదల కావడం.. థియేటర్లు సర్దుబాటు కాకపోవడంతో ఈగల్ వెనక్కు తగ్గాల్సి వచ్చింది. కానీ ఈగల్ సినిమా థ్రిల్లింగ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ గా ఉంటుందని.. రవితేజ కెరీర్ లోనే ది బెస్ట్ అవుతుందని చెబుతూ సినిమాపై ఎప్పటికప్పుడు క్యూరియాసిటిని కలిగించారు మేకర్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.