AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

M S Narayana: ఆరోజు రూ. 25 వేలు ఇవ్వగానే ఎం.ఎస్. నారాయణ కన్నీళ్లు పెట్టుకున్నారు: రవి రాజా పినిశెట్టి

ప్రముఖ దర్శకుడు రవి రాజా పినిశెట్టి, లెజెండరీ నటుడు ఎం.ఎస్. నారాయణతో తన మొదటి సమావేశాన్ని గుర్తుచేసుకున్నారు. భీమవరం నుంచి వచ్చిన ఎం.ఎస్. నారాయణ చెప్పిన కథకు ముగ్ధుడై, అడ్వాన్స్‌గా 25 వేల రూపాయలు ఇచ్చానని పినిశెట్టి తెలిపారు. ఈ సంఘటన ఎం.ఎస్. నారాయణ కెరీర్‌కు ఒక మలుపుగా నిలిచిందని, అది ఆయనను ఎంతగానో భావోద్వేగానికి గురిచేసిందని ఆయన వివరించారు.

M S Narayana: ఆరోజు రూ. 25 వేలు ఇవ్వగానే ఎం.ఎస్. నారాయణ కన్నీళ్లు పెట్టుకున్నారు:  రవి రాజా పినిశెట్టి
Ms Narayana
Rajeev Rayala
|

Updated on: Sep 12, 2026 | 9:40 PM

Share

ప్రముఖ దర్శకుడు రవి రాజా పినిశెట్టి ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రయాణం, కుటుంబ నేపథ్యం, అలాగే దివంగత నటుడు ఎం.ఎస్. నారాయణతో తన ప్రత్యేక అనుబంధం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఎం.ఎస్. నారాయణతో తొలి పరిచయం, ఆయనకు 25 వేల రూపాయలు అడ్వాన్స్‌గా ఇచ్చిన సంఘటనను పినిశెట్టి గుర్తుచేసుకున్నారు. భీమవరం నుంచి వచ్చిన ఎం.ఎస్. నారాయణను మేకప్ మ్యాన్ జస్తి మాధవరావు ద్వారా పినిశెట్టికి పరిచయం చేశారని తెలిపారు. నారాయణ తన కథను చెప్పడానికి కొంచెం భయపడుతున్నాడని, అయితే వినమని చెప్పడంతో పినిశెట్టి సావధానంగా విన్నారని పేర్కొన్నారు. భయపడుతూనే ఎం.ఎస్. నారాయణ చెప్పిన కథలోని సారాంశం తనకు ఎంతగానో నచ్చిందని పినిశెట్టి వివరించారు. కథ విని భావోద్వేగానికి లోనైన పినిశెట్టి వెంటనే 25 వేల రూపాయలు తీసుకెళ్లి, “ఈ కథ నాది” అని అడ్వాన్స్‌గా ఇచ్చారని తెలిపారు. ఆ సంఘటనతో ఎం.ఎస్. నారాయణ నమ్మలేక కన్నీరు పెట్టుకున్నారని, అది ఆయన కెరీర్ ప్రస్థానంలో ఒక ముఖ్యమైన మలుపుగా నిలిచిందని పినిశెట్టి గుర్తుచేసుకున్నారు. అప్పటి  నుంచి ఎం.ఎస్. నారాయణలోని కొన్ని ప్రత్యేకమైన మ్యానరిజమ్స్ తనకు నచ్చాయని, అది వారి బంధానికి పునాది వేసిందని ఆయన పేర్కొన్నారు.

B Gopal: తండ్రి కొడుకులను పెట్టి సినిమా చేశా.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది : బి. గోపాల్

తన కుటుంబ నేపథ్యం గురించి మాట్లాడుతూ, తన తండ్రి సత్య గొప్ప ప్రొడ్యూసర్ అని, తాను డైరెక్టర్ అయ్యాయని తెలిపారు. షూటింగ్ సమయంలో తన కుటుంబ సభ్యులు సెట్లో ఉండటం వల్ల ఎదురైన ఒక ఇబ్బందికర పరిస్థితిని పంచుకున్నారు. టెలిఫోన్ బూత్‌లో హీరోయిన్‌తో ఒక క్లోజ్ సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు, కెమెరా వెనుక తన కుటుంబం మొత్తం ఉండటం చూసి కొంత ఇబ్బంది పడ్డానని, అయితే అది కేవలం నటన అని నొక్కి చెప్పి సీన్‌ను పూర్తి చేశానని వివరించారు. తన తండ్రి సత్య పని విషయంలో చాలా కచ్చితంగా ఉండేవారని, తన వృత్తిని గౌరవించేవారని తెలిపారు.

అప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పుడు సినిమాలు మానేసి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

ఒక షాట్‌ను ఇంట్లో పది రకాలుగా ఆలోచించి, సరైన మార్గాన్ని ఎంపిక చేసుకున్న తర్వాతే సెట్‌కు వెళ్లేవారని, సెట్‌లో ఎవరైనా ఆ నిర్ణయాన్ని ప్రశ్నిస్తే అంగీకరించేవారు కాదని అన్నారు. ఈ మనస్తత్వమే తన సోదరుడికి కూడా వచ్చిందని పేర్కొన్నారు. తన సోదరుడు (దర్శకుడు) ఆర్టిస్టులతో చాలా కూల్‌గా వ్యవహరిస్తాడని, వాళ్లతో ఎక్కువగా చర్చలు జరిపి, వారి ఇన్పుట్స్ తీసుకుని పాత్రలకు మెరుగులు దిద్దుతాడని పినిశెట్టి ప్రశంసించారు. మలుపు లాంటి చిత్రాలలో ప్రతి ఆర్టిస్ట్ పనితీరు అద్భుతంగా ఉండటానికి ఇదే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.

నా కులం వాళ్లే కుట్ర చేశారు.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తామన్నారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us