Peddi Movie: కొత్త సీన్స్ వచ్చేశాయ్..! బాక్సాఫీస్ దగ్గర పెద్దిగాడి రేంజ్ డబుల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సినిమా ‘పెద్ది’ ప్రభంజనం కొనసాగుతోంది. జూన్ 04న విడుదలైన ఈ మెగా మూవీ రూ. 400 కోట్ల కలెక్షన్స్ తో దుమ్మురేపింది. రెండో వారంలోనూ ఈ సినిమాకు సాలిడ్ కలెక్షన్లు వస్తుండడం విశేషం.

Peddi Movie: కొత్త సీన్స్ వచ్చేశాయ్..! బాక్సాఫీస్ దగ్గర పెద్దిగాడి రేంజ్ డబుల్
Peddi Movie

Updated on: Jun 18, 2026 | 10:47 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మరో భారీ మైలురాయిని అందుకుంది. 400 కోట్ల గ్రాస్ మార్క్‌ను అధిగమించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా వీకెండ్ మాత్రమే కాకుండా, వర్కింగ్ డేస్‌లో సైతం బలమైన కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే తాజాగా పెద్ది సినిమాలో కొన్ని స్పెషల్ సీన్స్ ను యాడ్ చేశారు. మొత్తంగా 5 నిమిషాల 35 సెకన్ల సీన్స్ న యూ యాడ్ చేశారు. అంతే కాదు యాడ్ చేసిన సీన్స్ నేటి నుంచే థియేటర్లలో సందడి చేస్తాయని వెల్లడించారు మేకర్స్. మరి ఈ సీన్స్ తో సినిమాకు ఎక్స్‌ట్రా మైలేజ్ యాడ్ అవుతుందేమో చూడాలి.

ఇది కూడా చదవండి : తెలుగులో తిరుగులేని హీరోయిన్.. వెంకీ, బాలయ్య, నాగ్‌లతో నటించింది కానీ.. చిరంజీవితో ఒక్క సినిమా కూడా చేయలేదు

రామ్ చరణ్ కెరీర్‌లో సోలో హీరోగా 400 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి చిత్రం ‘పెద్ది’ కావడం. రెండో వారంలోనూ సినిమా అద్భుతమైన రన్ తో రామ్ చరణ్ బాక్సాఫీస్ స్టామినా ఎంత బలంగా ఉందో మరోసారి నిరూపించింది. అలాగే ప్రేక్షకులు ‘పెద్ది’ పాత్రతో ఎంత ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారో ఈ విజయం రుజువు చేసింది. వెంకట సతీష్ కిలారు భారీ నిర్మాణ విలువలతో నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణ భారత చిత్రంగా నిలిచింది.

ఇది కూడా చదవండి : Bigg Boss 10: ఈసారి ఆట మాములుగా ఉండదు.. బిగ్ బాస్ హౌస్‌లోకి ఆ క్రేజీ హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందా.?

తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఈ సినిమా అద్భుతంగా రన్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతోంది. ఎమోషన్స్, యాక్షన్, స్పోర్ట్స్ డ్రామా, పల్లెటూరి నేపథ్య కథనం వంటి అంశాల సమ్మేళనంగా తెరకెక్కిన ‘పెద్ది’ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రామ్ చరణ్ పవర్‌ఫుల్ నటనకు తోడు బుచ్చిబాబు సానా అందించిన ఎమోషనల్ కథనం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలను అందుకుంటోంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ‘పెద్ది’ విజయయాత్ర ఇంకా కొనసాగుతూ రానున్న రోజుల్లో మరిన్ని భారీ వసూళ్లతో కొత్త రికార్డులు సృష్టించనుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : సినిమాలు మానేసి హిమాలయాలకు వెళ్దామనుకున్నా.. అతనే నాకు తిరిగి ప్రాణం పోశారు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us