Ram Charan : పెద్ది పై అల్లు అర్జున్ రివ్యూ.. బన్నీకి స్వీట్ రిప్లై ఇచ్చిన రామ్ చరణ్..

ప్రస్తుతం థియేటర్లలో భారీ వసూళ్లతో దూసుకుపోతున్న రామ్ చరణ్ సరికొత్త స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' చిత్రాన్ని చూసిన అల్లు అర్జున్, సోషల్ మీడియా వేదికగా చరణ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా బన్నీ ట్వీట్ కు రిప్లై ఇచ్చారు చరణ్. వీరిద్దరి సంభాషణ ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటుంది. మరోవైపు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తుంది పెద్ది.

Ram Charan : పెద్ది పై అల్లు అర్జున్ రివ్యూ.. బన్నీకి స్వీట్ రిప్లై ఇచ్చిన రామ్ చరణ్..
Ram Charan Allu Arjun

Updated on: Jun 10, 2026 | 10:25 PM

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వచ్చిన గ్రాండ్ విజువల్ వండర్ ‘పెద్ది’. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ కేవలం 5 రోజుల్లోనే రూ. 300 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన ఈ సినిమాపై టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రివ్యూ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ‘పెద్ది’ చిత్రయూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా చూసిన అనంతరం అల్లు అర్జున్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. “గత రాత్రి ‘పెద్ది’ సినిమా చూశాను. నా ప్రియమైన రామ్ చరణ్ నటన మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఒక రఫ్ అండ్ రా లుక్, అద్భుతమైన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్, అదిరిపోయే డాన్స్ మూవ్స్‌తో చరణ్ ప్రతి అంశంలోనూ అదరగొట్టాడు. నా బ్రదర్‌ని చూసి నిజంగా ఎంతో గర్వపడుతున్నాను. ఈ సినిమాకు వస్తున్న ప్రశంసలకు తను 100 శాతం అర్హుడు” అని కొనియాడారు. అలాగే హీరోయిన్ జాన్వీ కపూర్, జగపతి బాబు నటనతో పాటు, చరణ్‌ను అత్యున్నత స్థాయిలో చూపించిన దర్శకుడు బుచ్చిబాబుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

బన్నీ చేసిన ఈ ఎమోషనల్ అండ్ పవర్‌ఫుల్ రివ్యూపై రామ్ చరణ్ వెంటనే స్పందించారు. అల్లు అర్జున్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. “మీరు మాకు శుభాకాంక్షలు చెప్పడం నాకు, మా ‘పెద్ది’ టీమ్‌కు చాలా ప్రత్యేకం. మీరు మాపై చూపించిన ఈ ప్రేమకు ధన్యవాదాలు బ్రదర్. ఇక మీ సినిమా రాకా (రాక) కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను” అంటూ రాసుకొచ్చారు. ఒకరి సినిమాలను మరొకరు సపోర్ట్ చేసుకుంటూ, చరణ్-బన్నీల మధ్య ఉన్న ఈ బంధాన్ని చూసి మెగా, అల్లు అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరి సోషల్ మీడియా సంభాషణ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’.ఈ సినిమా జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పెద్ది పాత్రలో రామ్ చరణ్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. క్రికెట్, కుస్తీ, రన్నింగ్.. ఇలా మూడు రకాల క్రీడలకు తగ్గట్టుగా తన బాడీ లాంగ్వేజ్‌ను, రూపాన్ని మార్చుకోవడానికి ఆయన పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో ఆయన నటన ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టిస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Trending Song: వామ్మో.. ఇదేం క్రేజ్ రా బాబూ.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న పక్కా ఫోక్ సాంగ్.. ఇన్ స్టాలో దుమ్మురేపుతున్న రీల్స్..

రామ్ చరణ్ ట్వీట్.. 

ఎక్కువ మంది చదివినవి : Sampath Raj : అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. ఆయన యాక్టింగ్ చూసి ఫిదా అయిపోయా.. నటుడు సంపత్ రాజ్..

Loading...
Unable to load recommendations.
Follow Us