AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల వాయిదా.. అధికారికంగా ప్రకటించిన మూవీ టీమ్

'ఆర్​ఆర్​ఆర్'​(RRR movie) సినిమా విడుదల వాయిదా పడింది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని మూవీ యూనిట్ తెలిపింది.

RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల వాయిదా.. అధికారికంగా ప్రకటించిన మూవీ టీమ్
Rrr
Ram Naramaneni
|

Updated on: Sep 11, 2021 | 1:47 PM

Share

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేసిన ఆర్.ఆర్.ఆర్ మూవీ షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయిన విషయం తెలిసిందే. అయితే సినిమాని ఎట్టి పరిస్తితుల్లో ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 13 నే రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా రాజమౌళితో పాటు ఆర్.ఆర్.ఆర్ మేకర్స్ ఆగష్టు ఫస్ట్ వీక్ వరకు ప్రకటిస్తూ వచ్చారు. కానీ ఆర్ఆర్ఆర్ రిలీజ్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న అందరికీ బ్యాడ్ న్యూస్. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్‌ విషయంలో ఫోకస్ తగ్గించడంతో సినిమా అక్టోబర్ 13 న రావడం లేదని అందరూ ఫిక్స్ అయ్యారు. తాజాగా అధికారికంగా కూడా ఆ ప్రకటన వచ్చేసింది. వరల్డ్ వైడ్‌గా థియేటర్స్ అన్ని ఇంకా పూర్తి సామర్థ్యంతో ఓపెన్ కాని నేపథ్యంలో అక్టోబర్ 13 న ఆర్.ఆర్.ఆర్ ని రిలీజ్ చేయలేకపోతున్నామని.. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామంటూ ట్వీట్ చేశారు. దానితో ఆర్.ఆర్.ఆర్ దసరా బరి నుండి అధికారికంగా తప్పుకున్నట్లు తేలిపోయింది. మరి వచ్చే ఏడాది సంక్రాంతికి ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అవ్వొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.

ఆర్ఆర్ఆర్ టీమ్ చేసిన ట్వీట్ దిగువన చూడండి 

ఈ సినిమాలో కొమరం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నాడు. అలాగే ఆలియాభట్, అజయ్ దేవగన్, ఒలీవియా మోరీస్‌, శ్రియ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’, ‘రామరాజు ఫర్‌ భీమ్‌’  టీజర్స్ అంచనాలు మరింత పెంచాయి. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘ఆర్ఆర్ఆర్’ నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తున్నారు.

Also Read: సాయి ధరమ్ తేజ్ తాజా హెల్త్ బులిటెన్‌లో అసలు డాక్టర్లు ఏం చెప్పారు.. పూర్తి వివరాలు మీ కోసం

ప్రియుడి సహకారంతో తల్లిని హత్య చేసిన కుమార్తె.. ఆపై డ్రామా షురూ.. కానీ

Follow Us
టీ20 వరల్డ్ కప్ 2026లో అట్టర్ ఫ్లాప్.. పాక్ ఆటగాళ్లకు భారీ జరిమనా
టీ20 వరల్డ్ కప్ 2026లో అట్టర్ ఫ్లాప్.. పాక్ ఆటగాళ్లకు భారీ జరిమనా
ఈ కూరగాయ రోజూ తిన్నారంటే పుష్కలమైన ఆరోగ్యం.. బెనిఫిట్స్ తెలిస్తే
ఈ కూరగాయ రోజూ తిన్నారంటే పుష్కలమైన ఆరోగ్యం.. బెనిఫిట్స్ తెలిస్తే
కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి షాక్
కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి షాక్
చికెన్, మటన్ బలాదూర్.. ఈ చేప తింటే ఆ సమస్యలన్నీ మాయం..
చికెన్, మటన్ బలాదూర్.. ఈ చేప తింటే ఆ సమస్యలన్నీ మాయం..
రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం.. వాటిపై దృష్టిపెట్టాలని..
రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం.. వాటిపై దృష్టిపెట్టాలని..
యుద్ధంపై భారత్‌ ఆందోళన.. ఎగుమతులపై తీవ్ర ప్రభావం
యుద్ధంపై భారత్‌ ఆందోళన.. ఎగుమతులపై తీవ్ర ప్రభావం
మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌.. వారికి అడ్డు కట్ట పడినట్లే
మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌.. వారికి అడ్డు కట్ట పడినట్లే
ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి మరో శుభవార్త
ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి మరో శుభవార్త
IND vs ENG సెమీఫైనల్‌కు వర్షం ఎఫెక్ట్.. రద్దైతే ఫైనల్ చేరేది ఎవరు
IND vs ENG సెమీఫైనల్‌కు వర్షం ఎఫెక్ట్.. రద్దైతే ఫైనల్ చేరేది ఎవరు
బైక్‌పై పాముతో రిస్కీ స్టంట్.. వైరల్ వీడియోపై నెటిజన్ల ఆగ్రహం
బైక్‌పై పాముతో రిస్కీ స్టంట్.. వైరల్ వీడియోపై నెటిజన్ల ఆగ్రహం