AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూట్యూబ్‌లో దూసుకుపోతున్న రాజ్ తరుణ్ టార్టాయిస్ సాంగ్.. విన్నకొద్దీ వినాలనిపిస్తుందిగా

10 మిలియన్స్ కు పైగా డిజిటల్ వ్యూస్ తో దూసుకెళ్తుంది రాజ్ తరుణ్ "టార్టాయిస్" మూవీ సాంగ్. ఈ సాంగ్ కు వస్తున్న రెస్పాన్స్ కారణంగా సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ సినిమా ఏకంగా నయా రికార్డ్స్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది.

యూట్యూబ్‌లో దూసుకుపోతున్న రాజ్ తరుణ్ టార్టాయిస్ సాంగ్.. విన్నకొద్దీ వినాలనిపిస్తుందిగా
Tortoise
Rajeev Rayala
|

Updated on: Sep 12, 2026 | 4:43 PM

Share

రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న “టార్టాయిస్” సినిమా మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్ జర్నీ స్టార్ట్ చేసింది. ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజ్ చేసిన ‘ నీ పరిచయం..’ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను అలరిస్తూ అతి తక్కువ టైమ్ లో 10 మిలియన్స్ కు పైగా డిజిటల్ వ్యూస్ సాధించింది. సినిమా నుంచి రిలీజ్ చేసిన తొలి పాటే ఇంత హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకోవడం ‘టార్టాయిస్’ మూవీపై అంచనాలు పెంచుతోంది.

B Gopal: తండ్రి కొడుకులను పెట్టి సినిమా చేశా.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది : బి. గోపాల్

మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ బ్యూటిఫుల్ మెలొడీ ట్యూన్ తో ‘ నీ పరిచయం..’ సాంగ్ ను కంపోజ్ చేసి మ్యాజిక్ చేశారు. ప్రేమికుల మనసుకు అద్దం పడుతూ, వారి ప్రేమ భావాలను ఈ పాటలోని సాహిత్యంలో అందంగా వ్యక్తీకరించారు ఆస్కార్ విన్నింగ్ లిరిక్ రైటర్ చంద్రబోస్. సింగర్ చిన్మయి ఈ పాటను మళ్లీ మళ్లీ వినేలా పాడారు. వీళ్లందరి ఎఫర్ట్స్ తో ‘నీ పరిచయం..’ గ్రేట్ మెలొడీగా రూపుదిద్దుకుంది. ఇటీవల రాజ్ తరుణ్ చిత్రాల్లో మ్యూజికల్ గా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్న సినిమా “టార్టాయిస్” అనే చెప్పుకోవచ్చు.

అప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పుడు సినిమాలు మానేసి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

“టార్టాయిస్” ఈ చిత్రంలో అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. “టార్టాయిస్” సినిమాను ఎస్ కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్ వీ ఎల్ క్రియేషన్స్ బ్యానర్స్ పై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను స్పెన్స్, డ్రామా కలిసిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు రిత్విక్ కుమార్ రూపొందిస్తున్నారు. మానస కుమార్ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ అందరి దృష్టినీ ఆకర్షించింది.

ఇవి కూడా చదవండి

నా కులం వాళ్లే కుట్ర చేశారు.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తామన్నారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us