అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ జంటగా నటించిన ‘పుష్ప 2’ చిత్రం రీలీజ్ ముందే రికార్డులు స్పష్టిస్తుంది. డిసెంబర్ 5న విడుదలవుతున్న ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. ‘పుష్ప: ది రూల్’ విడుదలకు ముందే డజన్ల కొద్దీ రికార్డులను తన పేరిట నమోదు చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం బుక్ మై షో, పేటీఎంలో కూడా రికార్డు స్పష్టించింది. సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఈ ఏడాది బిగ్గెస్ట్ పిక్చర్‌గా నిలవడాన్ని ఎవ్వరూ ఆపలేరన్నది క్లియర్‌గా అర్థమవుతుంది.
‘పుష్ప: ది రూల్’ అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ చిత్రానికి బుక్ మై షో, పేటీఎమ్‌లలో వస్తున్న స్పందనపై మూవీ యూనిట్ పోస్ట్‌ను షేర్ చేసింది. నిజానికి ‘పుష్ప: ది రూల్’ అడ్వాన్స్ బుకింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. కానీ ప్రేక్షకులు ఈ మూవీ చూడటానికి ఇప్పటికే తహతహలాడుతున్నారు. నవంబర్ 29 నుంచి దేశవ్యాప్తంగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కానుంది.
“అతిపెద్ద భారతీయ చిత్రం.. ప్రేక్షకులు అత్యంత ఎదురుచూసిన చిత్రం కూడా.. ‘పుష్ప: ది రూల్’ బుక్ మై షోలో ఒక మిలియన్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్‌ను, Paytmలో 1.3 మిలియన్లకు పైగా ఇంట్రెస్ట్‌ని పొందింది” అని మేకర్స్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
కేరళలోని కొచ్చిలో ఈరోజు పుష్ప 2 గ్రాండ్ ఈవెంట్ జరుగుతోంది. సినిమా స్టార్కాస్ట్, మేకర్స్ ఈవెంట్లో పాల్గొనబోతున్నారు. అంతకుముందు, మేకర్స్ ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను బీహార్ రాజధాని పాట్నాలో నిర్వహించారు. పాట్నాలో జరిగిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి రెండు లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఇటీవల, ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఈవెంట్‌ను కూడా చెన్నైలో ఏర్పాటు చేశారు, అక్కడ దాని ఐటెమ్ నంబర్ కిస్సిక్ విడుదలైంది. సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప: ది రూల్’ తెరకెక్కింది. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..